అంతర్జాతీయం

సియారా లియోన్‌లో భారీ వరదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రీటౌన్, ఆగస్టు 14: ఆఫ్రికా దేశమైన సియారా లియోన్ రాజధాని ఫ్రీటౌన్‌ను సోమవారం తెల్లవారుజామున భారీ వరదలు ముంచెత్తడంతో కనీసం 312 మంది మృతి చెందగా, 2 వేల మంది నిరాశ్రయలుగా మారారు. మృత దేహాలతో శవాల గదులు నిండిపోవడంతో జనం జాడ తెలియకుండా పోయిన తమ ప్రియతముల కోసం వెతుకుతూ ఉండడం కనిపించింది. నగరంలోని రెండు ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో రోడ్లన్నీ బురద నదులను తలపిస్తూ ఉన్నాయని, శవాలు, ఇళ్లు వరద నీటిలో కొట్టుకు పోవడం కనిపించిందని సంఘటన స్థలంనుంచి ఎఎఫ్‌పి వార్తాసంస్థ జర్నలిస్టు ఒకరు తెలిపారు. మృతుల సంఖ్య 312గా రెడ్‌క్రాస్ ప్రతినిధి పాట్రిక్ మస్సాక్యువోయి చెప్తూ, తమ బృందం ఇంకా విపత్తు సంభవించిన ప్రాంతాల్లో మృత దేహాల కోసం గాలింపులు కొనసాగిస్తూ ఉందని, అందువల్ల మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
నగరంలోని ఒక్క కన్నాట్ ఆస్పత్రిలోని శవాల గదికే 180 మృత దేహాలు ఇప్పటివరకు వచ్చాయని, ఆస్పత్రి శవాల గదికి చెందిన ఉద్యోగి మహమ్మద్ సినే్న చెప్పారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది చిన్నారులున్నారని, మృతదేహాలను ఉంచడానికి సైతం మార్చురీలో చోటు లేదని ఆయన చెప్పారు. చాలామృత దేహాలను ప్రైవేటు శవాల గదులకు తీసుకెళ్లినట్లు అతను చెప్పాడు. ముదురు ఆరెంచ్ రంగులో బురద వరద నగరంలోని ఓ వీధిని ముంచెత్తుతున్న దృశ్యాలు ఎఎఫ్‌పి వార్తాసంస్థకు లభించాయి. జనం మొలలోతు, ఛాతీ లోతు నీళ్లలో రోడ్లు దాటడాడనికి ప్రయత్నిస్తున్న వీడియో దృశ్యాలను స్థానికులు సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియారా లియోన్‌లో ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వరదలు రావడం సర్వసాధారణమై పోయింది.

చిత్రం.. వరద నీటిలా నగరాలను ముంచెత్తుతున్న బురద