అంతర్జాతీయం

ఏ క్షణమైనా యుద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, ఆగస్టు 15: తమ దేశానికి దగ్గరలో అమెరికా ఎయిర్ బేస్ ఉన్న గువామ్ దీవిపై క్షిపణి ప్రయోగానికి ఉత్తర కొరియా దాదాపు సన్నద్ధమైంది. గువామ్ దీవిపై క్షిపణిని ప్రయోగించేందుకు రూపొందించిన ప్రణాళికను ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ అన్‌కు సైనిక నేతలు వివరించారు. క్షిపణి ప్రయోగానికి సంబంధించి ప్రణాళిక ఎప్పుడో సిద్ధమైందని, దీనిపై కమాండింగ్ అధికారులతో కిమ్ సోమవారం సమీక్షించినప్పుడు చర్చించారని ప్యాంగ్‌యాంగ్ మీడియా వెల్లడించింది. అమెరికా సామ్రాజ్యవాదులు తమ మెడ చుట్టూ తిరిగి ముక్కును పట్టుకుంటున్నారని, వారి నిర్లక్ష్యపూరితంగా సైనిక సంఘర్షణను సృష్టిస్తున్నారని ఆరోపించింది. అమెరికా పసిఫిక్ ద్వీపంపై క్షిపణులను ప్రయోగించటాన్ని కిమ్ ప్రస్తుతానికి వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారని తెలిపింది. ‘కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను తగ్గించాల్సింది పోయి అత్యంత ప్రమాదకరమైన సైనిక సంఘర్షణకు అమెరికా ప్రయత్నిస్తోంది. గువామ్‌లో భారీఎత్తున అణ్వస్త్ర వ్యూహాత్మక సంపత్తిని మోహరించటం ద్వారా మరింతగా రెచ్చగొడుతోంది. ముందుగా అమెరికా ఇలాంటి అహంకార పూరితంగా రెచ్చగొట్టడం మానుకోవాలి. ఆగస్టు మధ్యవారంలో నాలుగు మధ్యంతర ఖండాంతర క్షిపణులను గువామ్‌పై ప్రయోగించాలని గత వారమే నిర్ణయించింది. గత నెలలో ఉత్తర కొరియా రెండు ఖండాంతర క్షిపణుల ప్రయోగంతో అమెరికా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన తరువాత ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించటం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేయటమూ చకచకా జరిగిపోయాయి. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో సహా ప్రపంచ నేతలు ఇరు వర్గాలను ప్రశాంతంగా ఉండాలని హితవు చెప్పారు. అమెరికాపై ఎలాంటి దాడి జరిగినా అది తక్షణం యుద్ధంగా మారుతుందని అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాటిస్ సోమవారం హెచ్చరించారు.