అంతర్జాతీయం

జాతి విద్వేషం, అసహనానికి పరాకాష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 17: వర్జీనియా రాష్ట్రంలో గత వారం ర్యాలీ సందర్భంగా శే్వత జాతీయులు పాల్పడిన హింను, ఈ హింసాకాండకు శే్వత జాతీయులతోపాటుగా వారి వ్యతిరేక వర్గం కూడా కారణమేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అమెరికాలోని హిందూ సిక్కు జాతీయులు ఖండించారు. మరో వైపు జాతి విద్వేషం, విదేశీయుల పట్ల ద్వేషం, ముస్లిం మత విద్వేషాలను ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఖండించి తీరాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అభిప్రాయ పడ్డారు. వర్జీనియా రాష్ట్రంలోని చార్లొట్సీవిల్లేలో ఇటీవల శే్వత జాతీయ వాదులు, వారిని వ్యతిరేకిస్తున్న వారి పోటీ ర్యాలీల సందర్భంగా హింసాకాండ చెలరేగిన విషయం తెలిసిందే. మితిమీరిన వేగంతో వచ్చిన ఒక కారు జనం గుంపుపైకి దూసుకెళ్లడంతో ఒక మహిళ మృతి చెందగా, మరో 19 మంది గాయపడ్డారు. చార్లొట్సీవిల్లేలో గత వారాంతంలో సంభవించిన హింసాకాండ విద్వేషాగ్నికి, జాతి విద్వేషానికి, అసహనానికి పరాకాష్ఠ అని, దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించి తీరాలని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శే్వత జాతీయ వాదులను, వారిని వ్యతిరేకించిన వారిని ఒకేగాటన కట్టి ఈ హింసాకాండకు రెండు వర్గాలు బాధ్యులేనంటూ చేసిన ప్రకటన తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆ ఫౌండేషన్ తన ప్రకటనలో పేర్కొంది. చార్లొట్సీవిల్లేలో జరిగిన సంఘటనలు సిగ్గుచేటే కాక గర్హనీయమని నేషనల్ సిక్ క్యాంపైన్ సహ వ్యవస్థాపకుడు రజ్వత్ సింగ్ వ్యాఖ్యానించారు. అయిదేళ్లక్రితం ఓక్‌స్ట్రీట్‌లో సిక్కులపై దాడి చేసిన టెర్రరిస్టు నమ్మిన సిద్ధాంతాలనే ఈ అమెరికన్ జాతీయతా వాదులు నమ్ముతున్నారని, విద్వేషం, అసహనంద్వారా అమెరికా సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.
ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి: గుటెరెస్
హింసాకాండకు ఇరు పక్షాలు బాధ్యులేనంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై అన్ని వర్గాలనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో జాతి విద్వేషం, విదేశీయుల పట్ల మితిమీరిన ద్వేషం, ముస్లింల పట్ల భయం విద్వేషం లాంటి వాటిని ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వ్యతిరేకించి తీరాల్సిందేనని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ అన్నారు.