అంతర్జాతీయం

అమానుషం... ఆటవికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 18: స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ఉగ్రవాద దాడిని అత్యంత ఆటవికమైనదిగా, పిరికిపందచేష్టగా ఐక్యరాజ్య సమితి తీవ్ర పదజాలంతో గర్హించింది. ఇలాంటి దాడులను ఎంతమాత్రం సహించడానికి వీల్లేదని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరాస్, భద్రతామండలి ఖండించాయి. ఇలాంటి గర్హనీయ చర్యలను ప్రోత్సహించేవారిని, అందుకు సహకరించేవారిని క్షమించడానికి వీల్లేదని పిలుపునిచ్చాయి. ఈ విపత్కర సమయంలో స్పెయిన్ ప్రభుత్వంతోనూ, ప్రజలతోనూ సంఘటితంగా పనిచేస్తామని, సంయుక్తంగానే ఉగ్రవాదాన్ని హింసాత్మక దాడులను ఎదుర్కొంటామని ఆంటోనియో స్పష్టం చేశారు. ఉగ్రదాడుల్లో మరణించినవారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఎలాంటి జాప్యం లేకుండా ఈ దాడికి కారకులైనవారిని, అందుకు కుట్రపన్నిన వారిని తగిన రీతిలో శిక్షించాలని గుటెరాస్ పిలుపునిచ్చినట్లుగా అధికార ప్రతినిధి ఫర్హన్ హక్ ఓ ప్రకటనలో తెలిపారు. భద్రతామండలి కూడా స్పెయిన్ దాడిని ఓ ప్రకటనలో తీవ్ర పదజాలంతో ఖండించింది. అంతర్జాతీయ శాంతిభద్రతలకు ఉగ్రవాదం పెను సవాలు అని, అది ఏ రూపంలో ఉన్నా ఉమ్మడిగా ఎదుర్కోవాల్సిందేనని మండలి సభ్య దేశాలు పిలుపునిచ్చాయి.
14కు పెరిగిన మృతులు
ఇదిలావుండగా బార్సిలోనా ఉగ్రదాడిలో మరణించినవారి సంఖ్య 14కు పెరిగింది. ఏకకాలంలో రెండుసార్లు ఈ దాడి జరిగినట్లుగా అత్యవసర సర్వీసుల విభాగం శుక్రవారం నాడు స్పష్టం చేసింది. మొత్తం రెండు వాహనాలు ఇటు బార్సిలోనాలోనూ, అటు కాంబ్రిల్స్‌లోనూ జనంపైకి దూసుకువెళ్లినట్లుగా ఈ ప్రకటన వెల్లడించింది.

చిత్రం..బార్సిలోనా ఉగ్రదాడిలో మృతిచెందిన వారికి సంతాపంగా కింగ్‌ఫెలిప్ సెంటర్‌లో శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రధాని మరియనో రజోయ్, కాటలోనియా రీజియన్ అధ్యక్షుడు కార్లెస్ పుయగ్‌డెమాంట్, ప్రజలు