అంతర్జాతీయం

పాక్‌లో ప్రజాస్వామ్యం బూటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 18: పాకిస్తాన్‌లో ఉన్నది బూటకపు ప్రజాస్వామ్యమేనని అమెరికా, యుకెలకు చెందిన నిపుణులు అభివర్ణించారు. పనామా పత్రాల కేసులో దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను పాకిస్తాన్ సుప్రీంకోర్టు తొలగించడంతో ఈ విషయం మరింతగా స్పష్టమైందని పేర్కొన్నారు. లండన్ యూనివర్శిటీలో జరిగిన ఓ సెమినార్ పాల్గొన్న ఐదుగురు విద్యావేత్తలు పాకిస్తాన్ తాజా పరిస్థితిపై విశే్లషణ జరిపారు. పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్య పతనం అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. ఇందులో మాట్లాడిన పాకిస్తాన్ నిపుణులు ఫర్జానా షేక్ తన దేశంలో ప్రజాస్వామ్యన్ని బోన్సాయ్ తరహా ప్రజాస్వామ్యంగా అభివర్ణించారు. పాకిస్తాన్ సుప్రీంకోర్టు నిర్ణయం నేపథ్యంలో అక్కడి ప్రజాస్వామ్యం ఉత్తిమాటేనన్న విషయం తేటతెల్లమైందని ఓ ప్రకటనలో ఈ నిపుణులు పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్‌ను న్యాయపరమైన తిరుగుబాటుతో తొలగించాలని వాషింగ్టన్‌లోని జార్జిటౌన్ యూనివర్శిటీకి చెందిన క్రిస్టైన్ ఫెయిర్ పేర్కొన్నారు. పాకిస్తాన్ సుప్రీంకోర్టు స్వతంత్రంగా వ్యవహరించిందని తాను భావించడం లేదని, సైన్యానికి - సుప్రీంకోర్టుకు మధ్య ఏర్పడ్డ సయోధ్యలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు.