అంతర్జాతీయం

హెచ్1బి వీసాల కోసం భారీగా దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 20: హెచ్1బి వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆంక్షలు విధించినప్పటికీ ఈ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీయుల్లో భారతీయులదే అగ్ర తాంబూలం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం హెచ్1బి వీసాల కోసం దాఖలైన దరఖాస్తుల్లో 74శాతం భారత్ నుంచి వచ్చినవేనని తాజాగా వెల్లడైన వివరాలను బట్టి తెలుస్తోంది. అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 30తో ముగిసే అమెరికా ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల వ్యవధిలోనే భారీ ఎత్తున భారతీయులు హెచ్1బి వీసాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. 2016 అక్టోబర్ నుంచి 2017 జూన్ 30 వరకు దాఖలైన మొత్తం దరఖాస్తుల్లో భారతీయులవే 74శాతం ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయంలో రెండో స్థానంలో చైనా ఉంది. జూన్ 30 వరకు ఈ వీసాల కోసం 3.36లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వీటిలో 1.97లక్షల దరఖాస్తులను ఆమోదించటం జరిగిందని అమెరికా పౌరసత్వ ఇమ్మిగ్రేషన్ సర్వీసుల విభాగం తెలిపింది. మిగతా దరఖాస్తులన్నీ పరిశీలనలో ఉన్నాయని వెల్లడించింది. అత్యధిక స్థాయిలో ఈ వీసాల కోసం భారతీయులే దరఖాస్తులు చేసుకుంటున్నారు కాబట్టి వారికే గరిష్ఠ స్థాయిలో ఇవి లభించే అవకాశాలుంటాయని అమెరికా సెనెటర్లు చెప్తున్నారు. అత్యధిక స్థాయిలో హెచ్1బి వీసాలు పొందుతున్న ఐటి సంస్థల్లో టెక్నాలజీ రంగమే అగ్రస్థానంలో ఉంది. వాటిలో కాగ్నిజాంట్(అమెరికా), ఇన్ఫోసిస్, టిసిఎస్, యాక్సెంచర్, విప్రోలు ఉన్నాయి.