అంతర్జాతీయం

అవినీతి కేసులో విచారణకు హాజరుకాని నవాజ్ కుటుంబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, ఆగస్టు 20: పనామా పత్రాల కేసులో అవినీతికి, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అభియోగాలను ఎదుర్కొంటున్న పదవీచ్యుత పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం రెండోసారి కూడా దేశ అత్యున్నత అవినీతి నిరోధక సంస్థ ఎదుట హాజరు కాలేదు. ఈ కేసు విచారణ నిమిత్తం ఆదివారం తమ ఎదుట హాజరు కావలసిందిగా నవాజ్ షరీఫ్, ఆయన కుమారులు హసన్, హుస్సేన్, కుమార్తె మరియం, అల్లుడు సప్ధర్ (రిటైర్డ్ కెప్టెన్)లను ఆదేశిస్తూ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో సమన్లు జారీ చేసిందని, అయితే వారిలో ఎవరూ ఆదివారం విచారణకు హాజరు కాలేదని ఎన్‌ఎబి అధికార ప్రతినిధి అసీమ్ అలీ నవాజిష్ పిటిఐ వార్తా సంస్థకు వెల్లడించారు. విదేశీ సంస్థల ద్వారా లబ్ధి పొందారన్న ఆరోపణలతో ప్రధానంగా మరియం చుట్టూ తిరుగున్న కేసులో ఆదివారం తమ ఎదుట హాజరు కావలసిందిగా నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన కుమారులకు, అల్లుడికి సమన్లు జారీ చేసిన ఎన్‌ఎబి, అవినీతి, మనీ లాండరింగ్ అభియోగాలకు సంబంధించిన మరో కేసులో శుక్రవారం విచారణకు రావలసిందిగా నవాజ్ షరీఫ్‌కు, ఆయన కుమారులకు సమన్లు జారీ చేసిందని, అయితే ఈ రెండుసార్లూ విచారణకు హాజరు కాలేదని అలీ వివరించారు.