అంతర్జాతీయం

నేడే సంపూర్ణ సూర్యగ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 20: అమెరికాలో 2017లో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (నాసా) 2014లోనే ధ్రువీకరించింది. ఇప్పుడు ఆ మాట నిజమయ్యే క్షణం వచ్చేసింది. సోమవారంనాడు కోట్లాది మంది అమెరికన్లు ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించబోతున్నారు. కెంటకీ, మిస్సౌరీ, ఇల్లినాయిస్‌తో పాటుగా అనేక రాష్ట్రాల్లో ఈ గ్రేట్ అమెరికన్ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించబోతోంది. 1979 తర్వాత అంటే 99 ఏళ్ల తర్వాత అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించడం ఇదే మొదటిసారి. సూర్యుడికి, భూమికి మధ్యగా చంద్రుడు వచ్చినప్పుడు సంపూర్ణ సూర్యహ్రణం ఏర్పడుతుంది. ఆ సమయంలో సూర్యుడు పూర్తిగా మూసుకు పోయి కరోనాగా పిలవబడే బయటి వాతావరణం మాత్రమే కనిపిస్తుంది. సోమవారం మధ్యాహ్నం ఓరెగావ్ మొదలుకొని దక్షిణ కరోలినా దాకా అమెరికాలోని 14 రాష్ట్రాలను రెండు నిమిషాల పాటు చీకట్లో మునిగిపోతాయని, ఆ సమయంలో ఉష్ణోగ్రతలు కూడా పడిపోవచ్చని నాసా పేర్కొంది.

చిత్రం..గ్రహణాన్ని వీక్షించేందుకు సిద్ధమైన ఔత్సాహికుడు