అంతర్జాతీయం

ఎన్నో ఏళ్లకు ముందే అల్జీమర్స్‌ను గుర్తించే పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిల్స్, ఆగస్టు 20: అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధిని గుర్తించేందుకు శాస్తవ్రేత్తలు సరికొత్త పరీక్షను అభివృద్ధి చేశారు. కంటికి ఎటువంటి గాటు పెట్టకుండా నిర్వహించే ఈ పరీక్ష ద్వారా రోగుల్లో అల్జీమర్స్ లక్షణాలు ప్రారంభం కావడానికి ఎన్నో ఏళ్ల ముందే ఈ వ్యాధికి సంబంధించిన కీలక లక్షణాలను గుర్తించేందుకు వీలవుతుందని అమెరికాలోని సెడార్స్-సినాయ్ మెడికల్ సెంటర్ పరిశోధకులు స్పష్టం చేశారు. అల్జీమర్స్ వ్యాధి మెదడుపై ప్రభావం చూపినట్లుగానే రెటీనాపై కూడా ప్రభావం చూపుతుందని వారు కనుగొన్నారు. ఈ పరిశోధన కోసం ప్రత్యేకంగా రూపొందించిన హై-డెఫినిషన్ ఐ స్కాన్‌ను ఉపయోగించి అమిలాయిడ్-బీటా డిపాజిట్స్‌ను గుర్తించామని, అల్జీమర్స్ వ్యాధికి గురికాబోయే వారిలో ఇవే కీలక సంకేతాలని తెలిపారు. అల్జీమర్స్ వ్యాధిని నిర్ధారించేందుకు రెటీనా ఎంతో విశ్వసనీయమైన ఆధారంగా ఉపయోగపడుతుందని తమ పరిశోధనలో తేలిందని సెడార్స్-సినాయ్ మెడికల్ సెంటర్ అసోసియేట్ ప్రొఫెసర్ మయా కొరోన్యో-హవౌయి వెల్లడించారు.