అంతర్జాతీయం

మరో కాస్మిక్ రికార్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 2: ఖగోళ విజ్ఞానం ఇప్పటివరకు సాధించిన రోదసీ రికార్డులను అధిగమించింది. దాదాపు 500 కోట్ల కాంతి సంవత్సరాల దూరంనుంచి హైడ్రోజన్ వాయువు లేశప్రాయ సంకేతాలను ధార్మిక కిరణాల ఖగోళ విజ్ఞానం అందిపుచ్చుకోగలిగింది. గతంలో సాధించిన దానికంటే ఇది దాదాపు రెండింతల దూరం రికార్డు. వందలాది కోట్ల శైశవ ప్రాచీన నక్షత్రాలతో కూడిన ఈ సుదూర గెలాక్సీనుంచి హైడ్రోజన్ సంకేతాలను అమెరికాకు చెందిన నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ ద్వారా గుర్తించగలిగారు. ఈ గెలాక్సీ అంతా కూడా హైడ్రోజన్ వాయు మేఘాల మయమేనని వెల్లడించారు. విశ్వంలో నక్షత్రాలు ఏర్పడడానికి ముడిపదార్థంగా హైడ్రోజన్ మూలకం ఉపయోగపడుతోంది. దీన్ని ఆధారంగా చేసుకునే నక్షత్ర మండలాల గురించి, వాటి అంతర్గత నిర్మాణం గురించి ఎప్పటివరకు కొత్త వివరాలను ఖగోళవేత్తలు అందిపుచ్చుకోగలుగుతున్నారు. ఇప్పటివరకు కూడా సమీపంలోని గెలాక్సీలనుంచే హైడ్రోజన్ సంకేతాలను రేడియో టెలిస్కోప్‌ల ద్వారా గుర్తిస్తూ వచ్చారు. ఇందుకు సంబంధించి రెండేళ్ల క్రితం సుదూర గెలాక్సీకి చెందిన హైడ్రోజన్ వాయువును గుర్తించారు. దానికీ భూమికి మధ్య ఉన్న దూరం 300 కోట్ల కాంతి సంవత్సరాలు. అయితే తాజా రేడియో టెలిస్కోప్ అత్యంత శక్తివంతమైంది కాబట్టి 500 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని హైడ్రోజన్ వాయువు సంకేతాలను కూడా అందిపుచ్చుకోగలిగింది.