అంతర్జాతీయం

మేం అడుగుపెడితే కల్లోలమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఆగస్టు 22: భారత్‌పై చైనా మరోసారి విషం చిమ్మింది. బెదింపుల స్థాయిని సైతం పెంచింది. డోక్లామ్ ఉద్రిక్తతపై భారత్ వాదన అర్థం లేనిదని, తమ సైన్యాలు భారత భూభాగంలోకి అడుగుపెడితే అంతా అల్లకల్లోలమే అవుతుందని హెచ్చరించింది. ‘వివాదాస్పద ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మిస్తోందన్న మిషతో భారత సైన్యాలు చైనా భూభాగంలోకి ప్రవేశించాయి. ఆ వాదన అర్థం లేనిది, హాస్యాస్పదమైనది’ అని చైనా విదేశాంగ శాఖ తెగేసి చెప్పింది. అంతేకాదు ‘సరిహద్దుల్లో భారత్ పెద్దఎత్తున సాగిస్తున్న వౌలిక సదుపాయాల నిర్మాణం తమ భద్రతకు ముప్పుగా పరిణమించిందన్న సాకుతో తాము గనుక భారత భూభాగంలోకి ప్రవేశించితే ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకోండి’ అని తీవ్రంగా హెచ్చరించింది. సిక్కింలోని డోక్లాం ప్రాంతంలో వివాదాస్పద ట్రై జంక్షన్ వద్ద చైనా రోడ్డు నిర్మాణం చేపట్టడాన్ని భారత సైన్యాలు అడ్డుకొన్నప్పటినుంచి గత కొన్ని వారాలుగా ఇరు దేశాల సైన్యాల మధ్య ఆ ప్రాంతంలో ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. డోక్లాం తమకు చెందినదని భూటాన్ వాదిస్తుండగా, చైనా మాత్రం అది తమ భూభాగమేనని అంటోంది. తమ దేశం ఎప్పుడూ శాంతినే కోరుకుంటోందని, ఎవరిపైనా దాడి చేయాలని అనుకోలేదని, చైనా కూడా ఆ దిశగా ఆలోచించి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కూడా చైనా విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. తాము కూడా శాంతినే కోరుకుంటామని, శాంతిని పాదుకొల్పడానికే ప్రయత్నిస్తామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ అన్నారు. అంతమాత్రాన తమ దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను పరిరక్షించుకునే విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ఈ విషయంలో ఎవరైనా ఒకటేనని ఆమె అన్నారు. సమస్య పరిష్కారం కావాలంటే డోక్లామ్‌నుంచి భారత సైన్యాలు వైదొలగడమొక్కటే మార్గమని ఆమె స్పష్టం చేశారు.