అంతర్జాతీయం

నిర్దయగా ఎదురుదాడి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, ఆగస్టు 22: అమెరికా, దక్షిణ కొరియా దేశాలు ప్రతి ఏటా నిర్వహించే సైనిక విన్యాసాల ప్రారంభంపై ఉత్తర కొరియా తన సహజసిద్ధమైన బెదిరింపు ధోరణితో స్పందించింది. ఈ విన్యాసాలు తమపై దాడి చేయడానికి జరిపే రిహార్సల్స్‌గా అభివర్ణించిన ఉత్తర కొరియా నిర్దయగా వీటిని తిప్పికొడతామని హెచ్చరించింది. సోమవారం ప్రారంభమైన ఈ సైనిక విన్యాసాలు 11 రోజులపాటు సాగనున్నాయి. ఈ సైనిక విన్యాసాల్లో పాల్గొనడం కోసం పసిఫిక్ సముద్ర ప్రాంతంలో అమెరికా సైనిక దళాల కమాండర్ అడ్మిరల్ హారిస్ సహా పలువురు అమెరికా ఆర్మీ ఉన్నతాధికారులు దక్షిణ కొరియాను సందర్శిస్తున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ హెచ్చరికలు చేసింది. అమెరికా, దక్షిణ కొరియాలు ప్రతి ఏటా నిర్వహించే ఈ సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా ఇలాంటి బెరిరింపు ప్రకటనలు చేయడమో లేదా క్షిపణి పరీక్షలు నిర్వహించడమో చేస్తూ వచ్చేది. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా సైనిక ప్రభుత్వం మధ్య టిట్ ఫర్ టాట్ అన్న రీతిలో మాటలయుద్ధం కొనసాగుతూ ఉండడంతో ఈసారి మాత్రం ఆందోళన ఎక్కువగానే ఉంది. సియోల్ చేరుకొన్న అమెరికా ఆర్మీ అధికారులు మంగళవారం దక్షిణ కొరియాలోని అమెరికా క్షిపణి వ్యవస్థను సందర్శించనున్నారు. అయితే ఈ విన్యాసాలకోసం అమెరికా లెక్కలేనన్ని ప్రాణాంతక ఆయుధాలను మోహరించిందని, తమ దేశంపై దాడి చేయడానికే ఈ విన్యాసాలని ఉత్తర కొరియా ఆరోపించింది. కొరియాలో ఉద్రిక్తతలు పెరిగిపోయిన నేపథ్యంలో దక్షిణ కొరియాలో ఇంత భారీఎత్తున సైనిక బలగాలు కేంద్రీకృతం కావడం వాస్తవ యుద్ధానికి దారితీయదని ఎవరూ కూడా చెప్పజాలరని ఆ ప్రకటన పేర్కొంది.