అంతర్జాతీయం

ఉమ్మడి సన్నద్ధత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోల్‌పోన్-టా (కిర్గిజ్ రిపబ్లిక్), ఆగస్టు 24: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర పరిస్థితులకు మరింత మెరుగ్గా స్పందించడానికి 2019లో చైనా, పాకిస్తాన్ సహా షాంఘై సహకార మండలి (ఎస్‌సిఓ) సభ్య దేశాలతో కలిసి సంయుక్తంగా పట్టణ ప్రాంత భూకంప సహాయ, పునరావాస విన్యాసాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని భారత్ గురువారం తెలియజేసింది. అత్యవసర పరిస్థితుల నిరోధం, నిర్మూలనపై షాంఘై సహకార మండలి దేశాల ప్రభుత్వాధినేతల తొమ్మిదో సమావేశంలో మన దేశం తరఫున ప్రకటన చేస్తూ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ ఈ విషయం తెలియజేశారు. ఉమ్మడి సన్నద్ధతను మెరుగుపర్చడంలో ఈ విన్యాసాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని రాజ్‌నాథ్ అన్నారు. గాలింపు, సహాయక బృందాలు సంయుక్త విన్యాసాలు నిర్వహించినప్పుడు అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు సహకరించుకునే విషయంలో అంతర్జాతీయంగా గుర్తించిన నిబంధనలు పాటించడంలో వారి మధ్య ఒక అవగాహన ఏర్పడడమే కాకుండా వ్యక్తిగత సాన్నిహిత్యం, స్నేహాలు పెరుగుతాయని, వారు ఉమ్మడిగా స్పందించేటప్పుడు ఇవి ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ‘2019లో పట్టణ ప్రాంత భూకంప గాలింపు, సహాయక చర్యల ఉమ్మడి విన్యాసాలను నిర్వహించడానికి భారత్ సిద్ధంగా ఉంది’ అని రాజ్‌నాథ్ చెప్పారు. చైనా, పాకిస్తాన్ సహా షాంఘై సహకార మండలిలోని అన్ని సభ్య దేశాలు ఇందులో పాల్గొంటాయి గనుక హోం మంత్రి ప్రకటనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎస్‌సిఓ సభ్య దేశాల ప్రకృతి విపత్తుల నిరోధానికి సంబంధించిన విభాగాల అధిపతుల తదుపరి సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి కూడా భారత్ సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ చెప్పారు. హోం మంత్రి చేసిన ఈ రెండు ప్రతిపాదనలను ఎస్‌సిఓ సభ్య దేశాలన్నీ ముక్తకంఠంతో అంగీకరించాయని హోం మంత్రి కార్యాలయం ఆ తర్వాత ఒక ట్విట్టర్‌లో తెలియజేసింది. 2001లో ఏర్పాటు చేసిన షాంఘై సహకార మండలిలో చైనా, కజకిస్థాన్, కిర్గిజ్ రిపబ్లిక్, రష్యా, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, భారత్, పాకిస్తాన్ సభ్య దేశాలు కాగా, దీని ప్రధాన కార్యాలయం బీజింగ్‌లో ఉంది. చైనా ఆధిపత్యం ఉండే ఈ గ్రూపులో భారత్, పాకిస్తాన్‌లు గత జూన్‌లో కజకిస్థాన్ రాజధాని ఆస్తానాలో జరిగిన శిఖరాగ్ర సదస్సులో సభ్య దేశాలుగా చేరాయి. ఆ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.