అంతర్జాతీయం

పాక్ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఆగస్టు 24: ఆఫ్గనిస్తాన్‌లో శాంతికోసం పాకిస్తాన్ నిర్వహిస్తున్న కీలకపాత్రను అమెరికా గుర్తించాలని చైనా అమెరికాకు సూచించింది. పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని గౌరవించటం బాధ్యత అని హితవు పలికింది. చైనా దౌత్య ఉన్నతాధికారి యాంగ్ జీచీ అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్‌కు పాకిస్తాన్ పట్ల చైనా వైఖరిని స్పష్టం చేశారు. టిల్లర్‌సన్‌తో యాంగ్ ఫోన్‌ద్వారా మాట్లాడారు. ఆఫ్గన్ విధాన ప్రకటన సందర్భంగా పాకిస్తాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించిన నేపథ్యంలో చైనా నేరుగా అమెరికాకు తన వైఖరిని తెలియజేసింది. ‘ఆఫ్గనిస్తాన్‌లో శాంతి స్థాపనలో పాకిస్తాన్ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ విషయంలో పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని అమెరికా గౌరవించాలి’ అని యాంగ్ స్పష్టం చేశారు. ‘పాకిస్తాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు తీవ్రమైనవి. ఉగ్రవాదంపై పోరాటంలో వాస్తవానికి పాకిస్తానే అన్నింటికంటే ముందుంది. ట్రంప్ వ్యాఖ్యలు పాకిస్తాన్ పట్ల మారుతున్న అమెరికా వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతల దృష్ట్యా ఇది ఎంతమాత్రం మంచిది కాదు’ అని ఆయన అన్నారు.