అంతర్జాతీయం

భారత్ బలమైన భాగస్వామి: అమెరికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 24: దక్షిణాసియాలో తమకు అత్యంత కీలకమైన భాగస్వామిగా భారత్ ఎదుగుతోందని అమెరికా వ్యాఖ్యానించింది. ఆఫ్గనిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు సహాయకారిగా భారత్ కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొంది. ఆఫ్గనిస్తాన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకోసం భారత్ దాదాపు మూడు బిలియన్ డాలర్ల మేర ఆర్థిక సహాయం అందించిందని, ఆఫ్గాన్ ప్రభుత్వానికి అన్ని విధాలా సహాయం చేయటంద్వారా భారత్ ఈ ప్రాంతంలో అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామిగా మారిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి హీదర్ నవెర్ట్ విలేఖరులకు తెలిపారు. ‘ఆఫ్గనిస్తాన్ ఆర్థికాభివృద్ధి కోసం భారత్ ఎంతో సాయం చేసింది. ఇందుకు మేం అభినందిస్తున్నాం. పాకిస్తాన్ కూడా ఆఫ్గాన్ శాంతి ప్రక్రియలో మరింత ముందుకు రావటం అవసరం’ అని అన్నారు.