అంతర్జాతీయం

చివరి క్షణం వరకూ పోరాడి ఓడిన సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లాస్గో, ఆగస్టు 27: ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో కడవరకూ పోరాడిన తెలుగు తేజం పివి సింధు రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. మహిళల సింగిల్స్ ఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి నొజోమీ ఒకుహరాతో చివరి క్షణం వరకూ నువ్వా నేనా అన్న చందంగా పోటీపడిన రియో ఒలింపిక్స్ రజత పతక విజేత సింధు మూడో సెట్ చివరిలో తనకు లభించిన ఆధిక్యాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. తీవ్రమైన ఒత్తిడికి గురైనట్టు కనిపించిన ఆమె చివరికి మ్యాచ్‌ని 19-21, 22-20, 20-22 తేడాతో చేజార్చుకుంది. 2013, 2014 సంవత్సరాల్లో ఈమెగా టోర్నీలో కాంస్య పతకాలను సాధించిన సింధు, ఈసారి తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఫైనల్‌లో మొదటి సెట్‌ను కేవలం రెండు పాయింట్ల తేడాతో కోల్పోయిన ఆమె రెండో సెట్‌ను తీవ్రంగా పోరాడి మరీ గెల్చుకుంది. చివరిదైన మూడో సెట్‌లో సింధు, ఒకుహరా సర్వశక్తులు ఒడ్డారు. పాయింట్ల కోసం పోటీపడ్డారు. చక్కటి ప్లేసింగ్స్‌తో, బలమైన షాట్లతో, వేగవంతమైన స్మాష్‌లతో విరుచుకుపడ్డారు. దీనితో ఒకసారి ఒకరు పాయింటు సంపాదిస్తే, మరోసారి మరొకరి ఖాతాలో పాయింట్ చేరింది. చివరిలో సింధు ఆధిక్యానికి దూసుకెళ్లింది. అయితే, ఒకుహరా సంయమనం కోల్పోకుండా ఆడింది. వరుసగా మూడు పాయింట్లు సంపాదించింది. 19-20గా వెనుబడిన సింధు ఒక పాయింట్ సాధించడంతో స్కోరు సమమైంది. ఈ దశలో ఒత్తిడిని అధిగమించలేకపోయిన సింధు చిన్నపాటి పొరపాటు కారణంగా ఒక పాయింట్‌ను కోల్పోయింది. ప్రత్యర్థికి మరో పాయింట్ రాకుండా నిరోధించడానికి తీవ్రంగా శ్రమించింది. కానీ, షటిల్‌ను నెట్‌కు కొట్టడంతో సింధు పోరాటానికి తెరపడింది. ఒకుహరా అతి కష్టం మీద గెలిచి, కెరీర్‌లో మొదటిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌ను సాధించింది. కాగా, మన దేశం తరపున ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఎక్కువ పతకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా, రజత పతకాన్ని అందుకున్న రెండో షట్లర్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. 2015 ఎడిషనల్‌లో మరో హైదరాబాదీ సైనా నెహ్వాల్ ఫైనల్‌లో ఓటమిపాలై, రజతాన్ని స్వీకరించగా, ఈసారి సింధుకు ఆ పతకం దక్కింది. సెమీ ఫైనల్‌లో ఓడిన సైనాకు ఈ పర్యాయం కాంస్య పతకం లభించింది. మొత్తం మీద ఈ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు రెండు పతకాలు లభించడం విశేషం.