అంతర్జాతీయం

ట్రంప్.. ఓ దగాకోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 2: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడటానికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో ముందున్న హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం దాదాపు ఖాయమైన డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం గురువారం తీవ్రమయింది. ‘ట్రంప్ యూనివర్శిటీ’ వివాదంలో చిక్కుకున్న డొనాల్డ్ ట్రంప్‌పై హిల్లరీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్రంప్ యూనివర్శిటీలో ప్రజల కష్టార్జితాన్ని సొమ్ము చేసుకొని పైకొచ్చిన విధంగానే ఇప్పుడు మొత్తం అమెరికా ప్రజలను దగా చేయడానికి ట్రంప్ యత్నిస్తున్నారని ఆమె న్యూజెర్సీలో జరిగిన ఎన్నికల సభలో ప్రసంగిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఈరోజు మనకు మరో కుంభకోణం గురించి తెలుస్తోంది. అది ట్రంప్ యూనివర్శిటి కుంభకోణం. అక్రమాలకు పాల్పడినందుకు డొనాల్డ్ ట్రంప్‌పై న్యూయార్క్ అటార్నీ జనరల్ చర్యకు ఉపక్రమించారు’ అని హిల్లరీ క్లింటన్ ఆరోపించారు. ట్రంప్ యూనివర్శిటీ అక్రమాలపై అందులోని ఉద్యోగులే సాక్షులుగా ముందుకు వచ్చారని ఆమె పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ పాల్పడిన అవినీతి, అక్రమాలకు ట్రంప్ యూనివర్శిటీ వ్యవహారం ఒక మచ్చుతునక అని ఆమె అన్నారు. ఇదిలా ఉండగా, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి అయిన హిల్లరీ క్లింటన్‌కు అమెరికా అధ్యక్ష పదవి చేపట్టదగిన ‘సహజమైన ప్రతిభ’ లేదని డొనాల్డ్ ట్రంప్ ఎదురుదాడికి దిగారు. కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలో నిర్వహించిన ఎన్నికల సభలో ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ అనేక మంది ప్రజలు తనను అధ్యక్ష పదవికి తగిన వ్యక్తినని భావిస్తున్నారని, హిల్లరీ క్లింటన్ అధ్యక్ష పదవికి తగిన వ్యక్తి కాదని భావిస్తున్నారని అన్నారు. హిల్లరీ క్లింటన్ ఈ-మెయిల్ కుంభకోణం గురించి ప్రస్తావించిన ట్రంప్.. అసలు ఆమెను అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం పోటీ పడనివ్వకూడదని అన్నారు.