అంతర్జాతీయం

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, ఆగస్టు 29: ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఒక బ్యాంకు వద్ద మంగళవారం జరిగిన ఆత్మాహుతి పేలుడులో అయిదుగురు చనిపోయారు. కొద్దిరోజుల్లో ఈద్ సెలవు ఉన్నదనగా ఈ పేలుడు ఒక్కసారిగా ఆఫ్గనిస్తాన్‌లో ఆందోళన రేపింది. సరిగ్గా మూడు నెలల క్రితం ఇదే ప్రాంతంలో జరిగిన పేలుడులో 150 మంది మరణిం చారు. కాబూల్ బ్యాంక్ ప్రభుత్వ ఉద్యోగులకు, సైనికులకు వేతనాలు చెల్లిస్తుంది. ఈ బ్యాంకు ఎదురుగానే పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఎనిమిది మంది పౌరులు గాయపడ్డారు. ఈ పేలుడుకు తామే బాధ్యులమని తాలిబన్‌లు ప్రకటించారు. పేలుడు జరిగిన మసూద్ స్క్వేర్‌లో షాపులు, బ్యాంకులే కాకుండా అమెరికా దౌత్య కార్యాలయం కూడా ఉంది.