అంతర్జాతీయం

గస్తీ కొనసాగుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఆగస్టు 29: కొన్ని నెలలుగా కొనసాగుతున్న డోక్లామ్ వివాదానికి తెరపడినట్లు అందరూ భావిస్తున్న తరుణంలో చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. భారత సైన్యాలు మాత్రమే వెనక్కి వెళ్లిపోయాయని అక్కడ తమ గస్తీ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అంతేకాదు డోక్లామ్‌లో రోడ్డు నిర్మాణాన్ని ఆపి వేయడంపై కూడా దాటవేత ధోరణిని ప్రదర్శించింది. ‘సరిహద్దులను కాపాడడానికి సంబంధించిన అవసరాలను తీర్చడానికి ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపర్చడానికి చైనా చాలాకాలంగా రోడ్డు నిర్మాణంతోపాటుగా వౌలిక సదుపాయాలను మెరుగుపర్చడాన్ని కొనసాగిస్తూ ఉంది’ అని చైనా విదేవాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ చెప్పారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ చైనా వెళ్లడానికి కొద్ది రోజుల ముందు భారత్, చైనాలు డోక్లామ్ ప్రాంతంనుంచి తమ సైన్యాలను ఉపసంహరించుకోవడంతో ఈ వివాదం ముగిసినట్లు భారత విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేయడం తెలిసిందే.
డోక్లామ్ ప్రాంతంలో రోడ్డు నిర్మాణాన్ని చైనా కొనసాగిస్తుందా అని విలేఖరులు అడగ్గా, ‘రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం’ అని హువా చున్యింగ్ చెప్పారు. అంతేకాదు డోక్లామ్ ప్రాంతంలో చైనా సరిహద్దు కాపలా బలగాలు తమ గస్తీని కొనసాగిస్తాయని కూడా ఆమె స్పష్టం చేశారు. డోక్లామ్‌లో రోడ్డు నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేసిన భూటాన్‌తో చైనా చర్చలు జరుపుతోందా అన్న ప్రశ్నకు సమాధానాన్ని సైతం ఆమె దాట వేశారు. ‘ఇప్పటివరకు మేము భారత సైన్యాల అక్రమ చొరబాటు సమస్యను పరిష్కరించాం’ అని మాత్రమే ఆమె చెప్పారు. బ్రిక్స్ సమావేశం సాఫీగా జరగడానికి చైనా డోక్లామ్‌లో రోడ్డు నిర్మాణాన్ని ఆపేసిందా అని అడగ్గా, దౌత్య మార్గాల ద్వారా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవడం రెండు దేశాల ప్రయోజనాలకు మేలు చేస్తుంది అని ఆమె అన్నారు. అంతేకాదు ఒక ప్రధాన దేశంగా చైనా చిత్తశుద్ధిని, బాధ్యతాయుత వైఖరిని ఇది చాటి చెప్తోందని కూడా ఆమె అన్నారు. కాగా, భవిష్యత్తులో ఘర్షణలు చోటు చేసుకోకుండా ఉండడానికి భారత్, చైనాలు ఒకరి సమస్యల పట్ల మరొకరు అర్థం చేసుకోవాలని సరిహద్దు ఉద్రిక్తతలు నేర్పిన గుణపాఠం అని చైనా విశే్లషకులు అభిప్రాయపడ్డారు.