అంతర్జాతీయం

హోస్టన్‌కు తొలగని ‘హార్వే’ ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోస్టన్, ఆగస్టు 29: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన హార్వే హరికేన్ ప్రభావానికి హోస్టన్ నగరం ఇప్పటికీ తేరుకోలేదు. మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు నగరంలో నివాస ప్రాంతాలు, ఇళ్లు, హైవేలు అన్నీ ఇప్పటికీ నీట మునిగే ఉన్నాయి. ఈ వారం చివరి దాకా హరికేన్ ప్రభావం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో 30 వేలకు పైగానే జనం తమ ఇళ్లను వదిలిపెట్టి వేరే ప్రాంతాల్లో తలదాచుకోవలసిన పరిస్థితి ఉండవచ్చని అధికారులు అంటున్నారు. కాగా, ఇప్పటివరకు హార్వే హరికేన్ కారణంగా కనీసం 9 మంది చనిపోయారు. వరదలనుంచి తప్పించుకోవడానికి ఓ తెల్లవ్యాన్‌లో వెళ్తున్న ఆరుగురు సభ్యుల కుటుంబం వ్యాన్‌తో పాటుగా నీటిలో మునిగి చనిపోయినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారిలో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. వెనుక డోర్ గుండా తప్పించుకుని వెళ్లమని వ్యాన్ డ్రైవర్ కుటుంబ సభ్యులను కోరినప్పటికీ వారు తప్పించుకోలేక పోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వ్యాన్ నీటిలో మునిగిపోవడం చూసిన స్థానికులు వారిని కాపాడడానికి యత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. నగర శివారు ప్రాంతమైన పోర్టల్ భారీ ఓక్ చెట్టు ఇంటిపై పడ్డంతో అరవై ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. అలాగే హార్వే తీరాన్ని దాటిన ప్రాంతానికి దగ్గర్లో ఉన్న రాక్‌పోర్ట్‌లో ఇద్దరు చనిపోయారు.
సోమవారం రోజంతా ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలకు హోస్టన్ నగరంలో వరద పరిస్థితి మరింతగా విషమించింది. చాలా ప్రాంతాల్లో సహాయక బృందాలు మొల లోతు నీళ్లలోనే బాధితులను ఆదుకోవడానికి ప్రయత్నిస్తుండడం కనిపించింది. హోస్టన్‌నుంచి న్యూ ఓర్లియాన్స్ దాకా దాదాపు కోటీ 30 లక్షల మందిపై హరికేన్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో చేరడంతో చాలామంది ఇళ్లపైకప్పులకు చేరుకొని సహాయంకోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది అయితే ఇళ్లపైనే టెంట్లు వేసుకొని బోటో, హెలికాప్టరో వచ్చి తమను రక్షించేదాకా అక్కడే ఉంటున్నారు. హరికేన్ హార్వే హోస్టన్ నగరాన్ని ఓ పెద్ద సరస్సులాగా మార్చి వేసిందని అమెరికా రెడ్‌క్రాస్‌కు చెందిన ఉన్నతాధికారి బ్రాడ్ కీసర్‌మన్ వ్యాఖ్యానించారు. మరో రెండు రోజుల పాటు 24 అంగుళాల మేర భారీ వర్షాలు, ఈదురు గాలులు, వరదలు కొనసాగే అవకాశం ఉందని జాతీయ వాతావరణ విభాగం తెలియజేసింది.

చిత్రం..భారీ వర్షాలకు నిరాశ్రయులైనవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యం