అంతర్జాతీయం

ముషారఫే నేరస్థుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 31:పాకిస్తాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో హత్య కేసులో మాజీ అధ్యక్షుడు పర్వెజ్ ముషారఫ్‌ను పరారీలో ఉన్న నేరస్థుడిగా ఉగ్రవాద నిరోధక కోర్టు గురువారం ప్రకటించింది. 2007 డిసెంబర్ 27న రావల్పిండిలో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఓ పార్కు నుంచి బయటికి వస్తూండగా బేనజీర్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఐదుగురు తహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ మిలిటెంట్లను న్యాయమూర్తి అస్గర్ అలీ ఖాన్ నిర్దోషులుగా ప్రకటించారు. బేనజీర్ హత్య జరిగిన అనంతరం అరెస్టయిన వీరు ఇప్పటి వరకూ జైల్లోనే ఉన్నారు. ఈ విషయంలో తమకు ముషారఫ్ అందించిన వీడియో సాక్ష్యాలు బూటకమని, దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించేందుకే దాన్ని సృష్టించారని ఫెడరల్ దర్యాప్తు ఏజెన్సీ ప్రధాన ప్రాసిక్యూటర్ మొహమ్మద్ అజ్‌హర్ చౌదరి తన ముగింపు వాదనల్లో కోర్టుకు స్పష్టం చేశారు. తనను తాను రక్షించుకోవడానికి ముషారఫ్ బ్రిగేడియర్ జావెద్ ఇక్బాల్‌తో కలిసి ఈ తప్పుడు ఆధారాలను సృష్టించారన్నారు.