అంతర్జాతీయం

డోక్లాంను వదులుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఆగస్టు 31:డోక్లాంలో తమ భూ భాగం లో ప్రతి అంగుళాన్నీ కాపాడుకుంటామని ఇందు లో భాగంగా దళాల సంఖ్యను, గస్తీని కూడా పెంచుతామని చైనా ఆర్మీ ప్రకటించింది. అయితే రహదారి నిర్మాణం నిలిపివేయడానికి సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ వివాదమే ఇరుదేశాల మధ్య 73 రోజుల పాటు ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసిన సంగతి తెలిసిందే. బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ బీజింగ్ వెళ్లడానిక రెండు రోజుల ముందు డోక్లాం నుంచి తమ తమ దళాలను ఉపసంహరించుకునేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి.
అయితే తమ జాతీయ సార్వభౌమత్వాన్ని, భద్రతను పరిరక్షించుకోవడంలో చైనా రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి రెన్‌గుయోకియాంగ్ ప్రకటించారు.డోక్లాం ప్రాంతం నుంచి చికెనెక్ ప్రాంతానికి సమీపంలో రోడ్డు నిర్మాణానికి సంబంధించి తమ సైనిక దళాలు చేస్తున్న ప్రయత్నాలపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఈ ప్రాంతంపై తమదే హక్కు అంటూ భూటాన్ ప్రకటించడం వల్ల ఈ మొత్తం వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తమ ఆధీనంలోని డోంగ్లాంగ్ ప్రాంతంలో గస్తీ కొనసాగిస్తామని సరిహద్దులు పరిరక్షించుకుంటామని రెన్ తెలిపారు. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్‌లో ఇక్కడ వౌలిక సదుపాయాల నిర్మాణాన్ని చేపడతామని స్పష్టం చేశారు. కాగా డోక్లాం నుంచి తమ దళాలను భారత్ ఉపసంహరించుకోడానికి వీలుగా చైనా రుణాలు అందిస్తోందన్న కథనాలను ఆయన తిరస్కరించారు. అలాగే డోక్లాం చైనాలో అంతర్గత భాగమని దీన్ని పూర్తిస్థాయిలో పరిరక్షించుకుని తీరతామని రెన్ వెల్లడించారు.
బ్రిక్స్‌లో చర్చించం
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత దేశ ఆందోళనను వచ్చే వారం జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో చర్చించబోరని చైనా గురువారం స్పష్టం చేసింది. అంతేకాదు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్ చేస్తున్న కృషిని ప్రశంసించడం ద్వారా గతంలో మాదిరిగానే చైనా తన మిత్ర దేశాన్ని వెనకేసుకు వచ్చింది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పాక్ ముందుభాగంలో ఉందని, ఇందుకోసం ఎన్నో త్యాగాలు చేసిందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ చెప్పారు. 3పాకిస్తాన్ కృషిని, దాని త్యాగాలను ప్రపంచ దేశాలు గుర్తించి తీరాలి2 అని ఆమె విలేఖరులతో అన్నారు.