అంతర్జాతీయం

భయంగుప్పిట రోహింగ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంగోన్, సెప్టెంబర్ 1: ఈ మధ్య కాలంలో 27 వేలమందికి పైగా రోహింగ్యా ముస్లింలు మైన్మార్‌నుంచి బంగ్లాదేశ్‌కు పారిపోయారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. కాగా, ఇలా పారిపోయిన వారిలో కొందరు సరిహద్దుల్లోని నదిని దాటడానికి జరిపిన ప్రయత్నంలో మునిగి పోయి చనిపోవడంతో, వారి మృతదేహాలు శుక్రవారం బంగ్లాదేశ్ వైపు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. మరో 20 వేల మంది పారిపోవడం కోసం సరిహద్దుల్లో ఎదురు చూస్తున్నారని, అయితే కాలిపోతున్న గ్రామాలనుంచి, మైన్మార్ సైన్యం జరుపుతున్న ఆపరేషన్లనుంచి తప్పించుకు వస్తున్నందున వారిని తమ బంగ్లాదేశ్ అనుమతించ లేదని గురువారం రాత్రి పొద్దుపోయాక విడుదల చేసిన ఒక ప్రకటనలో ఐరాస తెలిపింది. సైన్యంతో పాటుగా మిలిటెంట్లు ఒక పద్ధతి ప్రకారం మూకుమ్మడి హత్యాకాండకు, గ్రామాలను తగులబెట్టడానికి పాల్పడుతున్నట్లు పుకార్లు వస్తుండంతో మత హింసాకాండ చేయిదాటి పోతోందనే భయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏదో విధంగా బంగ్లాదేశ్ చేరుకోవాలనుకున్న వేలాది మంది రోహింగ్యాలు ఇరు దేశాలను వేరుచేస్తున్న నఫ్ నదిని దాటడానికి తాత్కాలిక పడవలను తయారు చేసుకొన్నారని తెలుస్తోంది. ఇలాంటి పడవల్లో ఒకటి మునిగిపోవడంతో శుక్రవారం నాడు 16 మృతదేహాలు బంగ్లాదేశ్ వైపునది ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు సరిహద్దు అధికారి ఒకరు చెప్పారు.
దీంతో గత రెండు రోజుల్లో బైటపడిన మృతదేహాల సంఖ్య 39కు చేరుకొంది. గత శుక్రవారం రోహింగ్యా మిలిటెంట్లు మారుమూల ప్రాంతాల్లోని పోలీసు పోస్టులపై దాడి చేసి 11 మంది ప్రభుత్వ అధికారులను హతమార్చడం తో అయిదేళ్లుగా కొనసాగుతున్న ఈ సంక్షోభంలో తాజా అంకం మొదలైంది. దీనికి ప్రతీకారంగా మైన్మార్ భద్రతా దళాలు రోజురోజుకు పెరిగిపోతున్న మిలిటెంట్లను ఏరివేయడానికి పెద్ద ఎత్తున సైనిక చర్యను ప్రారంభించడంతో పరిస్థితి చేయి దాటి పోతున్నట్లు కనిపిస్తోంది.