అంతర్జాతీయం

డోక్లామ్ ముడి వీడేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, సెప్టెంబర్ 2: భారత్, చైనాల మధ్య గత కొన్ని వారాలుగా సెగలు కక్కుతున్న డోక్లామ్ ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఇరు దేశాల అగ్రనేతలు సమావేశం కానున్నారు. ఐదు దేశాల బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర భేటీలో పాల్గొనేందుకు వస్తున్న భారత ప్రధానితో చైనా అధ్యక్షుడు ముఖాముఖి సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనా ఆగ్నేయ పట్టణమైన జియామెన్‌లో మూడు రోజులపాటు ఈ శిఖరాగ్ర భేటీ ఆదివారం నుంచి మొదలవుతుంది. ఇందులో బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా నేతలు కూడా పాల్గొంటున్నారు. 73 రోజులపాటు సాగిన డోక్లామ్ వివాదానికి తెరదించుతూ భారత్-చైనాలు తమ తమ దళాలు ఉపసంహరించుకున్నప్పటికీ ఈ వివాదం అడపా దడపా సెగలు కక్కుతూనే ఉంది. ఈ ముఖాముఖీ భేటీలో డోక్లామ్ ప్రతిష్ఠంభన గురించి మోదీ, జిన్‌పింగ్ చర్చించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర భేటీ సందర్భంగా మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య కీలకభేటీ జరిగే అవకాశం లేదని ఇటు చైనాగాని, అటు భారత్‌గాని స్పష్టం చేయకపోవడంతో ఇందుకు బలమైన అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి శిఖరాగ్ర భేటీలు జరిగినప్పుడు ఆయా దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగడం ఆనవాయితేనని భారత విదేశాంగ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. మరోపక్క చైనా కూడా ‘ఇందుకు అవకాశం ఉంటే’ మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య సమావేశానికి ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. బ్రిక్స్ శిఖరాగ్ర భేటీలో చర్చించేందుకు అవకాశం ఉన్న అంశాల గురించి చైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ శిఖరాగ్ర భేటీలో ఉగ్రవాద అంశాన్ని భారత్ లేవనెత్తడం అన్నది ఎంతమాత్రం భావ్యం కాదనే అభిప్రాయాన్నీ వ్యక్తం చేసింది. అయితే సోమవారంనాడు ఈ భేటీలో మోదీ ఏమి మాట్లాడతాడన్న దానిపై ఎలాంటి ఊహాగానాలు చేయలేమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు. తాజా సంకేతాలను బట్టి పాకిస్తాన్ ఉగ్రవాద అంశాన్ని బ్రిక్స్ వేదికగా భారత్ మరింత బలంగానే చాటిచెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది శిఖరాగ్ర భేటీని భారత్ నిర్వహించింది. ఆ సందర్భంగా మాట్లాడిన మోదీ ఉగ్రవాదానికి మూలకేంద్రంగా పాకిస్తాన్‌ను అభివర్ణించారు. అంతే తీవ్ర స్వరంతో అంతర్జాతీయ చర్యల ద్వారా ఈ మహమ్మారిని కూకటివేళ్లతో సహా పెకలించివేయాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా వుండగా, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో ఐదు దేశాల బ్రిక్స్ కూటమిని ఏవిధంగా బలోపేతం చేయాలన్న దానిపై ఈ శిఖరాగ్ర భేటీలో లోతుగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా రానున్న పది సంవత్సరాల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సందర్భంగా కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించుకునే అవకాశం కనిపిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా, బ్రెజిల్ అధ్యక్షుడు మైఖెల్ తెమర్‌లు హాజరుకానున్న ఈ శిఖరాగ్ర భేటీపై చైనా భారీగానే ఆశలు పెట్టుకుంది. ఇటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనూ, పాలనా రీతిలోనూ బ్రిక్స్ దేశాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ ఐదు దేశాల వాటా 23 శాతంగా గత ఏడాది నమోదైంది. దీన్నిబట్టి చూస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఊతంగా భావిస్తున్న బ్రిక్స్ శిఖరాగ్రం చైనా నుంచి అందించే సంకేతాలు ఏవిటన్నదానిపై ఆసక్తి నెలకొంది.

చిత్రాలు.. ప్రధాని నరేంద్ర మోదీ* చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్