అంతర్జాతీయం

ఆ సంకేతాలు గ్రహాంతర జీవులవేనా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 2: గ్రహాంతర జీవుల గురించి తాజాగా ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విశ్వంలోని ఇతర గ్రహాల్లో జీవజాతులు ఏవైనా ఉన్నాయా, ఒకవేళ ఉంటే, వాటి ఆకృతి ఏమిటన్నది దీర్ఘకాలంగా మానవ మేథస్సును తొలిచేస్తున్న ప్రశ్న. ఈ అంశంపై దశాబ్దాలుగా అద్యయనం చేస్తున్న ప్రపంచ ప్రఖ్యాత భౌతిక అంతరిక్ష శాస్తవ్రేత్త స్టీఫెన్ హాకింగ్ సారథ్యంలోని మిషన్ ఓ కీలక అంశాన్ని తెరపైకి తెచ్చింది. దాదాపు 3 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలోని ఓ గెలాక్సీ నుంచి (నక్సత్ర మండలం) కొన్ని వింత సంకేతాలు అందాయని స్పష్టం చేసింది. ఈ మిషన్‌లో పనిచేస్తున్న భారత సంతతి శాస్తవ్రేత్త విశాల్ గజ్జార్ ఈ సంకేతాల గురించి, వాటి ప్రాధాన్యత గురించి వెల్లడించారు. ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం విశ్వ ఆవిర్భావ రహస్యాలను మరింత శోధించి వాస్తవాలను నిర్ధారించడమే. తాజాగా ఓ సుదూర గెలాక్సీ నుంచి అందిన సంకేతాలను తమ మిషన్ గుర్తించ గలిగిందంటే దాని అర్థం గ్రహాంతర జీవులకు సంబంధించిన ఎలాంటి సంకేతాలనైనా తాము అందిపుచ్చుకోగలుగుతామని గజ్జార్ వెల్లడించారు. ఈ విశ్వంలో ఏ గ్రహంలోనైనా గ్రహాంతర జీవులు ఉండివుంటే వాటి సంకేతాలను కచ్చితంగా తాము గుర్తించగలుగుతామని తెలిపారు. అయితే తాజాగా తాము అందుకునే సంకేతాలు ఏ గ్రహం నుంచి వచ్చాయి, వాటి ఆనుపానులు ఏమిటన్నది స్పష్టం కాలేదన్నారు. ఈ రకమైన సంకేతాలను మరింత అందిపుచ్చుకునేందుకు, వాటిని లోతుగా విశే్లషించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 2015లో ఈ అంతర్జాతీయ ఖగోళ మిషన్‌ను హాకింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో రష్యాకు చెందిన శ్రీమంతుడు యూరీ మిల్లర్ కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఖగోళ శాస్తవ్రేత్తల బృందాలను ఏర్పాటు చేశారు. ఎంత సుదూరంలోని గెలాక్సీ నుంచైనా సంకేతాలను అందుకునే విధంగా అత్యంత శక్తివంతమైన టెలిస్కోపులను అమర్చారు. మానవాళి తప్ప ఇతర గ్రహాల్లో జీవజాతులు ఉనికికి సంబందించిన ఆధారం ఏమైనా ఉందా లేదా అన్న అంశాన్ని నిర్ధారించడం ఈ మిషన్ లక్ష్యం. పదేళ్లపాటు అమలయ్యే ఈ రోదసీ అధ్యయనం ద్వారా భూమికి అతి దగ్గరగా ఉన్న లక్ష నక్షత్రాలను లోతుగా పరిశీలిస్తారు. మొత్తం మన పాలపుంత అంతా కూడా ఈ అధ్యయన పరిధిలోకి వస్తుంది. మన నక్షత్ర మండలం ఆవల ఉన్న మరో వంద నక్షత్ర మండలాల నుంచి వచ్చే సంకేతాలను కూడా ఈ మిషన్ అందిపుచ్చుకోగలుగుతుంది.