అంతర్జాతీయం

ప్రత్యామ్నాయ మేథస్సే ప్రపంచ మేటి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: రానున్న కాలంలో ప్రపంచాన్ని శాసించేది ప్రత్యామ్నాయ మేథస్సేనని (ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానంలోని ఈ సరికొత్త అంశాన్ని అవపోసన పట్టగలిగినవారే రాజ్యం చేస్తారని ఆయన ఉద్ఘాటించారు. ఒక రష్యాకే కాదు, మొత్తం మానవాళికే ఈ ప్రత్యామ్నాయ మేథస్సు అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఎఐగా పేర్కొనే ఈ సరికొత్త శాస్త్ర విజ్ఞానంతో అపారమైన అవకాశాలు లభిస్తాయని, అయితే దీనివల్ల వచ్చే ముప్పులు ఎలా ఉంటాయన్నది ముందుగా ఊహించడం కష్టతరమేనని పేర్కొన్నారు. ఈ సరికొత్త విజ్ఞాన శాస్త్రంలో ఎవరు పట్టు సాధించినా ప్రపంచాన్ని శాసించగలుగుతాడని పుతిన్‌ను ఉటంకిస్తూ రష్యా టెలివిజన్ చానల్ స్పష్టం చేసింది. అయితే ఈ రంగంపై ఎవరూ గుత్త్ధాపత్యం చెలాయించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పుతిన్ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా అంతరిక్ష విజ్ఞానం, వైద్య శాస్త్రం, మానవ మెదడు సామర్థ్యం తదితర అంశాలపై కూడా ఆయన మాట్లాడారు. ‘కనురెప్పల కదలికతోనే అనేక సిస్టమ్స్ ఆపరేట్ అవుతాయి. అత్యంత తీవ్రమైన, సంక్లిష్టమైన వాతావరణాల్లో పరిస్థితుల్లోనూ మానవ ప్రవర్తన ఎలా ఉంటుందన్న దానిపైన ఈ ప్రత్యామ్యాయ ఇంటెలిజెన్స్ వల్ల ఒక అంచనాకు రావడం సాధ్యమవుతుంది’ అని పుతిన్ తెలిపారు. 45 నిమిషాలపాటు రష్యాలోని 16వేల స్కూళ్లకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులను ఉద్దేశించి పుతిన్ మాట్లాడారు.