అంతర్జాతీయం

న్యాయంకోసం అప్పీల్ చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, సెప్టెంబర్ 2: తన భార్య బేనజీర్ భుట్టో హత్యకేసులో వెలువడిన తీర్పు ఎంతమాత్రం సంతృప్తికరంగా లేదని, దానిపై అప్పీల్ చేసుకుంటానని ఆమె భర్త, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారీ శనివారం ఇక్కడ వెల్లడించారు. 2007లో జరిగిన ఈ హత్య కేసులో నిందితులైన ఐదుగురు తాలిబన్ మిలిటెంట్లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించడాన్ని ఆయన నిరసించారు. కేసుకు సంబంధించి ఉగ్రవాద నిరోధక కోర్టు తహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్‌కు చెందిన ఐదుగుర్ని నిర్దోషులుగా ప్రకటించింది. 2007 డిసెంబర్ 27న రావల్పిండిలో జరిగిన బేనజీర్ హత్యతో వీరికి సంబంధం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని, అందుకే వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులకు ఒక్కొక్కరికి 17 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించిన కోర్టు మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ను పరారీలో ఉన్న నిందితుడిగా పేర్కొంది. ఆయన ఆస్తులు జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. ఎన్నికల్లో ర్యాలీ సందర్భంగా తనకు భద్రత కల్పించాలని బేనజీర్ భుట్టో అభ్యర్థించినప్పటికీ అప్పటి ముషారఫ్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని సంయుక్త దర్యాప్తు బృందం తన నివేదికలో స్పష్టం చేసింది. అయితే ఐదుగుర్ని నిర్దోషులుగా ప్రకటించడం ఎంతమాత్రం న్యాయ సమ్మతం కాదని స్పష్టం చేసిన జర్దారీ దీన్ని సవాల్ చేస్తూ తదుపరి అప్పీల్ చేసుకుంటామన్నారు. ముషారఫ్ తన నేరాలు అన్నింటికీ సమాధానం చెబితే తప్ప న్యాయం జరిగినట్టు కాదని బేనజీర్ కుమార్తె అసిఫా భుట్టో ట్వీట్ చేశారు. మరోపక్క ఏటిసి తీర్పును పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తిరస్కరించింది. దీన్ని ఏ విధంగా సవాల్ చేయాలన్నదానిపై పరిశీలన జరుపుతున్నామని స్పష్టం చేసింది.