అంతర్జాతీయం

బ్రిక్స్ భాగస్వామ్యం మరింత శక్తివంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జియామెన్, సెప్టెంబర్ 3: చైనాలోని జియామెన్‌లో సోమవారంనుంచి జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఇక్కడికి చేరుకున్నారు. చైనాలో తన రెండు రోజుల పర్యటన సందర్భంగా మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో పాటుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇతర బ్రిక్స్ దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారత్, చైనా సైన్యాల మధ్య సిక్కిం సరిహద్దుల్లోని డోక్లాంలో సుదీర్ఘకాలం ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మోదీ చైనాలో పర్యటిస్తుండం ప్రాధాన్యతను సంతరించుకొంది. కొద్ది రోజుల క్రితమే ఇరు దేశాలు తమ సైన్యాలను డోక్లాంనుంచి ఉపసంహరించుకోవడం ద్వారా ఈ ఉద్రిక్తతకు తెరదించడం తెలిసిందే. మంగళవారం ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశం కూడా ప్రస్తావనకు రావచ్చని భావిస్తున్నారు. కాగా, చైనా పర్యటనకు మయలుదేరి వెళ్లే ముందు ప్రధాని ఒక ప్రకటనలో చైనా నేతృత్వంలో మరింత బలమైన ‘బ్రిక్స్’ భాగస్వామ్యానికి తోడ్పడే అజెండాకోసం నిర్మాణాత్మక చర్చలు, ఫలితాలను ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సుకు చైనా ఈజిప్టు, కెన్యా తజకిస్థాన్, మెక్సికో, థాయిలాండ్ దేశాలను కూడా అతిథి దేశాలుగా ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో మోదీ ఈ దేశాల నేతలతోను చర్చలు జరిపే అవకాశముంది.
బ్రిక్స్ సదస్సు అనంతరం ఈ నెల 5న మయన్మార్‌లో పర్యటనకు వెళ్తారు. తన మయన్మార్ పర్యటన రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారానికి ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకోవడానికి దోహదపడ్తుందని భావిస్తున్నట్లు కూడా ప్రధాని ఆ ప్రకటనలో తెలిపారు. రెండు దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాల్లో పరిణామాలను, అభివృద్ధి సహకార కార్యక్రమాన్ని,మయన్మార్‌లో భారత్ చేపడుతున్న సామాజిక-ఆర్థిక సహకారాన్ని మరింత విస్తృత పరచుకునే దృష్టితో చర్చలు జరుపుతాయని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన వారసత్వ నగరం బగాన్‌ను కూడా సందర్శించాలని అనుకొంటున్నట్లు ప్రధాని ఆ ప్రకటనలో తెలిపారు. గత ఏడాది మయన్మార్‌లో సంభవించిన భూకంపంలో ఇక్కడి పగోడాలు అనేకం ధ్వంసమయ్యాయి. ఈ పగోడాలను పునరుద్ధరించడంతో పాటుగా ఆనంద ఆలయం పునర్నిర్మాణ కార్యక్రమాన్ని సైతం భారత పురావస్తు విభాగం చేపడుతోంది. మోదీ మయన్మార్‌లో పర్యటించడం ఇది రెండో సారి. 2014లో ఆసియాన్-్భరత్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మయన్మార్ వెళ్లారు.

చిత్రం.. జియామెన్‌లో తనకు స్వాగతం చెప్పేందుకు వచ్చిన భారతీయులతో
ముచ్చటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ