అంతర్జాతీయం

....యుద్ధానికి సిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, సెప్టెంబర్ 3: ఉత్తర కొరియాకు అమెరికా సంకీర్ణ దళాలకు మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఉత్తర కొరియా ఆరోసారి విజయవంతంగా అణ్వస్త్రాన్ని పరీక్షించింది. సుదూర లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు సైతం మోసుకుపోగల హైడ్రోజన్ బాంబును సఫలీకృతంగా పరీక్షించినట్లు ఉత్తరకొరియా టెలివిజన్ ప్రకటించింది. 50 నుంచి 60 కిలోటన్నుల శక్తిమంతమైన బాంబును ఉత్తరకొరియా ప్రయోగించినట్లు దక్షిణ కొరియా వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సరిగ్గా ఏడాది క్రితం 2016 సెప్టెంబర్‌లో ఉత్తర కొరియా అయిదోసారి అణ్వస్త్ర పరీక్ష నిర్వహించింది. అప్పటి పరీక్ష కంటే తాజాగా నిర్వహించిన పరీక్ష అయిదు నుంచి ఆరు రెట్లు అధిక శక్తిమంతమైందని పేర్కొంది. ఉత్తర కొరియాలోని ఉత్తర హాంగ్యాంగ్ ప్రావిన్స్‌లోని కిలిజులో అణ్వస్త్ర పరీక్ష జరిగిందని దీని ప్రభావం వల్ల 5.7 తీవ్రతతో భూ కంపం వచ్చినట్లు తెలిపింది. ‘‘హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించాం. ఇది రెండు దశల థర్మో న్యూక్లియర్ ఆయుధం. ఇది అత్యంత శక్తిమంతమైంది.’’ అని ఉత్తర కొరియా టెలివిజన్ పేర్కొంది. అమెరికా జియొలాజికల్ సర్వే విభాగం 6.3తీవ్రతతో భూకంపం వచ్చినట్లు రికార్డు చేసింది. చైనా వాతావరణ కేంద్రం వరుసగా రెండు సార్లు భూకంపాన్ని నమోదు చేసింది. దక్షిణ కొరియా అద్యక్షుడు మూన్ జాయ్ ఇన్ అత్యవసరంగా జాతీయ భద్రతామండలి సమావేశాన్ని నిర్వహించారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనటానికి సైన్యం సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. అమెరికా సంకీర్ణ దళాలతో కలిసి ఉత్తరకొరియాను ఎదుర్కోవాలన్నారు. కిమ్ దూకుడుపై అమెరికా, జపాన్‌లు తీవ్రంగా మండిపడ్డాయి. ‘‘ ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఉత్తర కొరియా మరో అణు పరీక్ష చేస్తే మేం తీవ్రంగా ప్రతిఘటించాల్సి వస్తుంది.’’ అని జపాన్ ప్రధానమంత్రి షింజో అబే హెచ్చరించారు. నిరుడు సెప్టెంబర్ 9న ఉత్తర కొరియా రెండు అణు పరీక్షలు నిర్వహించింది. ఆ తరువాత కూడా వరుసగా ఖండాంతర క్షిపణులను పరీక్షిస్తూ వస్తోంది. తాజా అణ్వస్త్ర పరీక్ష అనంతరం ఉత్తర కొరియా కొన్ని ఫోటోలను విడుదల చేసింది. ఈ ఫోటోలలో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ తన లెఫ్టినెంట్ జనరళ్లతో థెర్మో న్యూక్లియర్ ఆయుధాన్ని పరీక్షిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. వెండి రంగులో ఉన్న వేరుశనగ గింజ ఆకారంలో ఉన్న ఈ ఆయుధాన్ని తాను పరిశీలించారు. హైడ్రోజన్ బాంబు తయారు చేసిన ప్రయోగశాలను కిమ్ పరీశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన తరువాతే ప్రయోగం జరిగింది. గత ఆగస్టులో వాసంగ్-12క్షిపణిని జపాన్ మీదుగా ఉత్తర కొరియా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిశీలించిన అణ్వస్త్రాన్ని తన క్షిపణుల ద్వారా అమెరికాలోని అన్ని నగరాలను లక్ష్యం చేసుకోవచ్చని ఉత్తర కొరియా చెప్తోంది. అమెరికా సైనిక సౌకర్యాలు పూర్తిస్థాయిలో ఉన్న గువామ్ దీవిని విధ్వంసం చేసేందుకు ఉత్తర కొరియా ఇప్పటికే సిద్ధమైంది. పేలుడుకు వినియోగించిన పదార్థాల ఆనుపానులు తెలుసుకోవటానికి అమెరికా దాని మిత్ర దేశాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్యాంగ్‌యాంగ్ అత్యాధునిక హైడ్రోజన్ బాంబును ప్రయోగించటంలో పూర్తిగా విజయం సాధించింది.