అంతర్జాతీయం

ఉత్తర కొరియాపై ప్రపంచ దేశాల ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 3: ఉత్తర కొరియా ఆదివారం హైడ్రోజన్ బాంబును పరీక్షించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ప్రపంచ దేశాలన్నీ మండిపడ్డాయి. చివరికి ఉత్తర కొరియా మిత్రదేశమైన చైనా సైతం ఇలాంటి తప్పుడు చర్యలను మానుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌కు హితవు చెప్పింది. ఉత్తర కొరియా చేష్టలు, ప్రకటనలు అమెరికాకు వ్యతిరేకంగా, అత్యంత ప్రమాదకరంగా మారాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియా ఒక రోగ్ నేషన్ (వంచక దేశం) అని, ఏదో సాయం చేద్దామనుకొన్న చైనాకు సైతం ఇబ్బందికరంగా మారిందని ఆయన అన్నారు. ఉత్తర కొరియాను బుజ్జగించే చర్యలు ఫలించవని దక్షిణ కొరియా తెలుసుకొంది. వాళ్లకు ఒక్కటే అర్థమవుతుంది అని కూడా ట్రంప్ అన్నారు. కాగా, ఉత్తర కొరియా జరిపిన ఆరో అణుపరీక్షను తీవ్రంగా ఖండించిన చైనా ఇలాంటి తప్పుడు చర్యలను మానుకొని కొరియా ప్రాంతాన్ని అణ్వస్త్ర రహితం చేసేందుకు చర్చలకు ముందుకు రావాలని హితవు చెప్పింది. అంతర్జాతీయ సమాజం అంతా వ్యతిరేకిస్తున్నా ఉత్తర కొరియా మరోసారి అణు పరీక్ష జరిపిందని, చైనా ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండిస్తోందని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికైనా కొరియా ప్రాంతాన్ని అణ్వస్త్ర రహితం చేయడానికి అంతర్జాతీయ సమాజం చేస్తున్న కృషికి సహకరించాలని, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలను పాటించాలని కిమ్ ప్రభుత్వానికి చైనా హితవు చెప్పింది. దక్షిణ కొరియా, జపాన్, భారత్ సైతం ఉత్తర కొరియా అణు పరీక్షను తీవ్రంగా ఖండించాయి. ఉత్తర కొరియా అణు పరీక్షలపై తీవ్రంగా స్పందిస్తామని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్ అన్నారు. చర్చల ద్వారానే ఉత్తర కొరియా సమస్య పరిష్కారం అవుతుందని రష్యా ప్రభుత్వ ప్రతినిధి అన్నారు.