అంతర్జాతీయం

ఇక ఉపేక్ష వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దౌత్య ప్రయత్నాలన్నీ హరించుకు పోయాయి. ఉత్తర కొరియాపై అత్యంత కఠిన చర్యలకు సమయమొచ్చింది’ అని అమెరికా పిలుపునిచ్చింది. తాజాగా జరిగిన హైడ్రోజన్ బాంబు పరీక్షపై ప్రపంచ దేశాలన్నీ షాక్‌కు గురయ్యాయి. భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమై మార్గాంతరాలపై చర్చించింది. ఇందులో మాట్లాడిన అమెరికా రాయబారి నిక్కీ హేలీ ‘ఇప్పటి వరకూ జరిగింది చాలు.. కఠిన చర్యలే తదుపరి మార్గం’ అని తెలిపారు. ఉత్తర కొరియాతో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలన్నీ దానికి సహకరిస్తున్నట్టేనని కూడా హెచ్చరిక స్వరాన్ని వినిపించారు. ఉత్తర కొరియాపై తీసుకునే చర్యల విషయంలో అన్ని దేశాలూ సహకరించాలని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో పిలుపునిచ్చారు.

చిత్రం..ఉ.కొరియా అణుబాంబును పరీక్షించిన నేపథ్యంలో న్యూయార్క్‌లో అత్యవసరంగా సమావేశమైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి