అంతర్జాతీయం

దౌత్యపరమైన చర్చలే పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జియామెన్, సెప్టెంబర్ 5: ఉత్తర కొరియాపై దౌత్యపరమైన పరిష్కారం కుదరని పక్షంలో అది ప్రపంచానికే వినాశకారిగా మారుతుందని రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అయితే ఉత్తరకొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాలన్న అమెరికా డిమాండ్‌వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని కూడా ఆయన అన్నారు. దీంతో ఉత్తర కొరియాను ఎలా అదుపు చేయాలన్న విషయంలో ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య విభేదాలు మరింత సుస్పష్టమయ్యాయి. అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో రష్యా, చైనా ఒకవర్గంగా, అమెరికా, దాని మిత్రదేశాలు మరోవర్గంగా చీలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. హైడ్రోజన్ బాంబును పరీక్షించినందుకు ఉత్తర కొరియాపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని అమెరికా సోమవారం డిమాండ్ చేయడం తెలిసిందే. ఈ చర్యతో ఇప్పటికే తన అణు కార్యక్రమాల కారణంగా అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా మరింత ఏకాకి అయ్యే ప్రమాదం ఎదురైన విషయం తెలిసిందే. ఇప్పటికే భద్రతా మండలి ఉత్తరకొరియాపై ఏడు రకాల ఆంక్షలను విధించింది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలతో పాటుగా భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలయిన ఫ్రాన్స్, బ్రిటన్ కూడా ఉత్తరకొరియాపై మరింత కఠినమైన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉత్తరకొరియాకు చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించడమే దీనికి పరిష్కారమని ఆ దేశాలు భావిస్తున్నట్లు విశే్లషకులు అంటున్నారు. అయితే రష్యా మాత్రం ఉత్తరకొరియాపై మరిన్ని ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకిస్తుండగా, ఉత్తరకొరియాకు రాజకీయంగా, ఆర్థికంగా అత్యంత సన్నిహిత దేశమైన చైనా ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినప్పటికీ ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించడాన్ని అది మొదటినుంచి వ్యతిరేకిస్తూనే ఉన్న విషయం తెలిసిందే. చైనాలో బ్రిక్స్ సమావేశం అనంతరం పుతిన్ విలేఖరులతో మాట్లాడుతూ ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలను రష్యా ఖండిస్తోందని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి చర్చలే సరయిన మార్గమని, ఎలాంటి ఇతర చర్యలు తీసుకున్నా సమస్య మరింత జటిలం అవుతుందని అన్నారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఆంక్షలు విధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు’ అని స్పష్టం చేశారు.