అంతర్జాతీయం

భారత్‌కు ఎఫ్-18, ఎఫ్-16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 7: భారత్‌కు ఎఫ్-18, ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించాలన్న ప్రతిపాదనను తాము గట్టిగా సమర్థిస్తున్నామని ట్రంప్ ప్రభుత్వం అమెరికా కాంగ్రెస్‌కు తెలియజేసింది. అంతేకాదు ఇది భారత్-అమెరికా రక్షణ సంబంధాలను మరింతగా బలపడడానికి దోహదం చేస్తుందని కూడా స్పష్టం చేసింది. భారత్‌తో రక్షణ సహకారం ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన మూలస్తంభం అని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఒక కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి కావాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందని విదేశాంగ శాఖలో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయ మంత్రి అలీస్ వెల్స్ అమెరికా కాంగ్రెస్‌కు చెందిన ఉపసంఘానికి ఒక లిఖితపూర్వక వాదనలో తెలియజేశారు. భారత్‌కు ఎఫ్-18, ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించడానికి బోయింగ్, లాక్‌హీడ్ కంపెనీలు చేసిన ప్రతిపాదనలను ట్రంప్ ప్రభుత్వం బలంగా సమర్థిస్తోందని ఆమె తెలిపారు. ఈ ప్రతిపాదనలు భారత్-అమెరికా రక్షణ సహకారాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లగలదని కూడా తాము భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ప్రపంచ జనాభాలో సగం ఇండో-ఆసియన్ ప్రాంతంలో ఉందని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కొన్ని దేశాలు కూడా ఇక్కడ ఉన్నాయని ఆమె కమిటీకి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. భావస్వామ్యం కలిగిన భాగస్వాములతో కలిసి పనిచేయడం ద్వారా ప్రపంచ శాంతిని కాపాడగల వ్యూహాత్మక, ఆర్థిక సామర్థ్యం భారత్‌కు ఉందని, రక్షణ భాగస్వామ్యంలో భాగంగా మనం పెట్టే పెట్టుబడులు రాబోయే సంవత్సరాల్లో మంచి ఫలితాలనివ్వనున్నాయని ఆమె తెలిపారు. ‘్భరత్, అమెరికా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న దేశాలు. ముఖ్యంగా భారత్ ప్రస్తుతం అత్యంత విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. నిత్యం సరిహద్దుల గుండా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్, అమెరికా సంయుక్తంగా శిక్షణా కార్యక్రమాలను చేపట్టడం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం జరిపే పోరాటానికి చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను’ అని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా యాంటీ టెర్రరిజం అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద 2009నుంచి ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా భద్రతా అధికారులు అమెరికానుంచి శిక్షణ పొందిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వాముల్లో భారత్ ఒకటని వెల్స్ స్పష్టం చేశారు. ‘అధ్యక్షుడు ట్రంప్ మాటల్లో చెప్పాలంటే భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఇప్పుడున్నంత బలంగా, మెరుగ్గా గతంలో ఎన్నడూ లేవు’ అని కూడా ఆమె స్పష్టం చేశారు.