అంతర్జాతీయం

పాక్ ఉగ్ర చర్యలకు నిధులే నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 7: అత్యధిక స్థాయిల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూరుతున్న 50 దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉందని స్విస్‌కు చెందిన ఓ బృందం జరిపిన దర్యాప్తులో వెల్లడైంది. మనీలాండరింగ్, ఉగ్రవాదానికి నిధుల లభ్యత అంశంపై మొత్తం 146 దేశాల పరిస్థితిని బాసెల్ పాలనా సంస్థ ఈ సర్వే నిర్వహించింది. ఇందుకు సంబంధించిన సూచిలో అఫ్గనిస్తాన్, నేపాల్, శ్రీలంక అగ్రస్థానంలో ఉన్నాయని పాకిస్తాన్ 46వ స్థానంలో ఉందని సంస్థ వెల్లడించింది. మొత్తం 10 పాయింట్ల ఆధారంగా ఉగ్రవాద ఫైనాన్సింగ్, మనీలాండరింగ్ అంశాలపై ఈ అధ్యయనం జరిపింది. జీరో సూచిలో ఉన్న దేశాల్లో కనిష్ఠ రిస్కు శాతం పది పాయింట్ల వద్ద ఉన్న దేశాల్లో అత్యధిక రిస్కు శాతం ఉన్నట్టుగా స్పష్టం చేసింది. అత్యధిక స్థాయిలో ప్రమాదం ముంచుకొస్తున్న దేశాల్లో అఫ్గనిస్తాన్, ఖజకిస్తాన్, లావోస్, మొజాంబిక్, మాలీ, కంబోడియా ఉన్నాయి. అతి తక్కువ రిస్కు శాతం ఉన్న దేశాల్లో ఫిన్‌లాండ్, లిథ్‌వేనియా, ఇస్టోనియాలున్నాయి. అత్యధిక స్థాయిలో 8.60 పాయింట్లతో తీవ్రస్థాయి రిస్కును ఇరాన్ ఎదుర్కోంటోంది.