అంతర్జాతీయం

వాతావరణ మార్పులు, రక్షణ సహకారంపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 4: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అనేక ప్రధాన అంశాలు చర్చించాలని ఒబామా ప్రభుత్వం భావిస్తోంది. భద్రత, రక్షణ సహకారం అలాగే వాతావరణ మార్పులపై మోదీతో చర్చిస్తామని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. 2015 జనవరిలో అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటనతో ఇరుదేశాల సంబంధాలు మరింత బలపడ్డాయ. ఆర్థిక వృద్ధికి దోహదపడే అనేక కీలక అంశాలు, వాతావరణ మార్పులు, రక్షణ సహకారంపై ఇరుదేశాధినేతల మధ్య చర్చలు జరుగుతాయని వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ జెన్నీఫర్ ఫ్రైడ్‌మాన్ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత పటిష్టం కావడానికి చర్చలు దోహదం చేస్తాయని ఆమె పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 6న వాషింగ్టన్ డిసి చేరుకుంటారు. మూడు రోజులపాటు ఆయన అమెరికాలో పర్యటిస్తారు. జూన్ 7న అధ్యక్షుడు ఒబామాతో భేటీ అవుతారు. వైట్‌హౌస్‌లో ఇరువురు నేతలు అనేక అంశాలపై చర్చిస్తారు. 8వ తేదీన యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగిస్తారు.