అంతర్జాతీయం

ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస, సెప్టెంబర్ 8: కాశ్మీర్‌పై ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ చేపడుతున్న చర్యలను భారత్ గర్హించింది. జమ్మూకాశ్మీర్ భారత్‌లో అవిభాజ్య భాగమని ఐరాసలో స్పష్టం చేసింది. ఉగ్రవాదమే ప్రభుత్వ విధానంగా పాకిస్తాన్ వ్యవహరిస్తోందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఐరాసలో కాశ్మీర్ అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్న భారత దౌత్యవేత్త శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ‘ఉగ్రవాదులకు పాకిస్తాన్ మూల కేంద్రంగా మారింది. వారికి అన్ని విధాలుగా సహాయ, సహకారాలను అందిస్తోంది‘అని ఆరోపించారు. కాశ్మీర్ అంశాన్ని తరచూ ఐరాసలో ప్రస్తావించడం ద్వారా పాక్ తన కుత్సిత నైజాన్ని చాటుకుంటోందని ఆయన విమర్శించారు. జమ్మూకాశ్మీర్ భారత్‌లో తిరుగులేని అంతర్భాగమని ఈ వాస్తవాన్ని గుర్తించి పాకిస్తాన్ తన ధోరణిని మార్చుకుంటే మంచిదని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య దేశంగా, ప్రజల అభిమతానికి అనుగుణంగా భారత్ పనిచేస్తోందని, ఉగ్రవాదులను, తీవ్రవాదులను క్షమించేది లేదని ప్రసాద్ వెల్లడించారు. మహాత్మాగాంధీ ప్రవచించినట్టుగా అహింసాయుత పంథాలోనే సమస్యలను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నది భారత అభిమతం అని ఆయన స్పష్టం చేశారు.