అంతర్జాతీయం

గొర్రెమాంసం ప్రకటనలో గణేశుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, సెప్టెంబర్ 8: గొర్రె మాంసం తినడాన్ని ప్రోత్సహించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన మాంసాహారం, లైవ్‌స్టాక్ అసోసియేషన్ (ఎంఎల్‌ఏ) విడుదల చేసిన ఓ అడ్వర్టయిజ్‌మెంట్‌లో హిందువులకు అత్యంత ఇష్టుడైన వినాయకుడిని, ఇతర దేవుళ్లను అవమానించే విధంగా చిత్రీకరించడంపై ఆ దేశంలోని భారతీయులు మండిపడుతున్నారు. కాగా, ఈ వ్యవహారాన్ని ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు, కళలు, వ్యవసాయ మంత్రి త్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి అభ్యంతరం కూడా తెలియజేయడం జరిగిందని కాన్‌బెర్రాలోని భారత హైకమిషన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఎంఎల్‌ఏ ఇటీవల విడుదల చేసిన ఓ వీడియో అడ్వర్టయిజ్‌మెంట్‌లో గణేశుడు, బుద్ధుడు, ఏసుక్రీస్తు, గ్రీకు దేవతలంతా ఓ టేబుల్ చుట్టూ కూర్చుని గొర్రె మాంసాన్ని ఆస్వాదిస్తూ ఉన్నట్లుగా ఉంది. దీనిపై ఆస్ట్రేలియాలోని హిందూ సంస్థలు, భారతీయుల నిరసనలకు కారణమయింది.