అంతర్జాతీయం

ఇర్మాగుప్పిట ఫ్లోరిడా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాప్-హైతీన్ (హైతీ), సెప్టెంబర్ 8: హార్వీ సృష్టించిన బీభత్సంనుంచి ఇంకా పూర్తిగా కోలుకొని అమెరికాను మరో పెను తుపాను ఇర్మా2 వణికిస్తోంది. అమెరికా దక్షిణ ప్రాంతంలోని ఫ్లోరిడా వైపుగా దూసుకు వస్తున్న ఈ పెను తుపాను ఇప్పటికే కరేబియన్ దీవుల్లో విధ్వంసాన్ని సృష్టించింది. శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం ఫ్లోరిడా తీరాన్ని తాకవచ్చని భావిస్తున్న ఇర్మా తుపాను కారణంగా ఇప్పటివరకు కరేబియన్ దీవుల్లో 14 మంది చనిపోగా, వందలాది మంది గాయపడ్డారు. 12 లక్షల మందిపై ఇర్మా2తుపాను ప్రభా వం ఉండవచ్చని ప్రాతమికంగా భావిస్తున్నా, ఈ సంఖ్య 1.2 కోట్ల దాకా పెరగవచ్చని రెడ్‌క్రాస్ సొసైటీ అంచనా వేసింది. ఇప్పటికే ఇర్మా ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని భావిస్తున్న ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాల్లో వేల సంఖ్యలో జనాన్ని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పరిస్థితిని ఎదుర్కోవడానికి అత్యవసర సర్వీసులన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఆహారం లాంటి నిత్యావసరాల కొనుగోలుకోసం జనం సూపర్ మార్కెట్లకు పరుగులు పెడుతున్నారు. దీంతో సూపర్ మార్కెట్లు ఖాళీ అవుతున్నాయి.
గంటకు 295 కిలోమీటర్ల వేగంతో కరేబియన్ దీవులను అతలా కుతలం చేసిన ఇర్మా తుపాను ప్రస్తుతం వర్జీన్ ఐలాండ్స్, పోర్టారికో ప్రాంతాలపై తన ప్రతాపం చూపిస్తోంది. కాగా, శుక్రవారం ఉదయానికి తుపాను తీవ్రత కాస్త తగ్గి, పెనుగాలులు గంటకు 250 కిలోమీటర్లకు తగ్గినప్పటికీ తుపాను ఇప్పటికీ అత్యంత ప్రమాదకరమైనదిగానే ఉందని అమెరికా నేషనల్ హరికేన్ సెంటర్ పేర్కొంది.
కాగా, తుపాను తాకిడికి చాలా కరేబియన్ దీవులు స్మశానాన్ని తలపిస్తున్నాయని, అనేక భవనాల పైకప్పులు ఎగిరిపోయాయని,దాదాపు 60 శాతం ఇళ్లు నేలమట్టమైనాయని అధికారులు వెల్లడించారు. కార్లు, చివరికి షిప్పింగ్ కంటైనర్లు సైతం పెనుగాలుల తాకిడికి ఎగిరిపోయాయి. పోర్టారికోలో కనీసం ఇద్దరు చనిపోయారని, దాదాపు 30 లక్షల జనాభాలో సగం మంది కరెంటు లేక చీకట్లో అవస్థలు పడుతున్నారని, నదులన్నీ కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. అమెరికా వర్జీన్ ఐలాండ్స్‌లో మరో నలుగురు చనిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్లలో పోర్టారికోకు తరలిస్తున్నట్లు గవర్నర్ కార్యాలయం తెలియజేసింది. బార్బుడా దీవిలో ఒకరు చనిపోగా, 300 మందిని ఆంటిగ్వాకు తరలించారు. ఫ్రాన్స్, నెదర్లాండ్ దేశాల మధ్య విడిపోయి ఉన్న సెయింట్ మార్టిన్ దీవిపై ఇర్మా ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ప్రముఖ విహార కేంద్రమైన ఈ అందాల దీవి ఇప్పుడు శ్మశానాన్ని తలపిస్తోందని అధికారులు అంటున్నారు. తమ వైపు కనీసం తొమ్మిది మంది చనిపోయారని, మరో ఏడుగురి జాడ తెలియడం లేదని ఫ్రాన్స్ అధికారులు చెప్పారు. మరో 112 మంది గాయపడ్డారని, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఫ్రాన్స్ ఆంతరంగిక వ్యవహారాల మంత్రి గెరార్డ్ కొల్లోంబ్ చెప్పారు. దీవిలోని ప్రతి పది ఇళ్లలో ఆరు ఇళ్లు నివాసయోగ్యం కాని రీతిలో దెబ్బ తిన్నాయని కూడా ఆయన చెప్పారు. మొత్తం నష్టం 200 మిలియన్ యూరోలకు పైగానే ఉండవచ్చని బీమా కంపెనీలు అంచనా వేస్తున్నాయి. దీవిలోని డచ్ వైపు మరొకరు చనిపోయినట్లు అధికారులు చెప్పారు. కాగా, తుపాను కారణంగా ఆహారం, తాగు నీరు, పెట్రోల్‌కు తీవ్ర కొరత ఏర్పడ్డంతో జనం వీథుల్లోకి వచ్చి దోపిడీలకు పాల్పడుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

చిత్రాలు.. కరీబియన్ అతలాకుతలం * ఫ్లోరిడా