అంతర్జాతీయం

మళ్లీ క్షిపణి పరీక్ష!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, సెప్టెంబర్ 8: ప్రపంచ దేశాల ఆదేశాలను ధిక్కరిస్తూ తనదైనరీతిలో ముందుకు పోతున్న ఉత్తర కొరియా మరో క్షిపణి పరీక్షకు సిద్ధమవుతోందా? ఉత్తర కొరియా ఆవిర్భవించి శనివారం నాటికి 69 సంవత్సరాలు పూర్తికానున్న సందర్భంగా ఈ పరీక్షను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు భావిస్తున్నారు. ఇప్పటికే హైడ్రోజన్ బాంబును పరీక్షించి ప్రపంచ దేశాలను కలవరపెట్టిన కొరకరాని కిమ్‌జోంగ్ ఉన్ మరోసారి క్షిపణి పరీక్షను నిర్వహించే అవకాశం లేకపోలేదని దక్షిణ కొరియా ఆందోళన చెందుతోంది. ఇలాంటి ఉత్సవాలు ఎప్పుడు జరిగినా ఈ రకమైన పరీక్షలతోనే తమ సత్తాను చాటుకోవడం అన్నది ఉత్తర కొరియాకు ఆనవాయితీగా మారడంతో శనివారం ఏమి జరగబోతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. 9వ తేదీన ఖండాండతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షను ఉత్తర కొరియా నిర్వహించడం ఖాయం అన్నట్టుగానే దక్షిణ కొరియా ప్రధాని లీనాక్ యోన్ సంకేతాలు అందించారు. ఇదే విషయాన్ని ఆ ప్రభుత్వ అధికారులు కూడా అన్యాపదేశంగా స్పష్టం చేశారు. ఈ సంకేతాలను బట్టిచూస్తే పరిస్థితి మరింతగా వేడెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒక వేళ ఉత్తర కొరియా కొత్త క్షిపణి పరీక్ష నిర్వహిస్తే ఏ విధంగా స్పందించాలన్నదానిపై ఐరాస భద్రతామండలి ఇప్పటికే చర్చించింది. చాలా దేశాల మాదిరిగానే తమ స్వాతంత్య్ర దినోత్సవం లేదా సంస్థాపక దినోత్సవాలను ప్రదర్శనలు, ప్రకటనలతో, బలప్రయోగంతో నిర్వహించుకోవాలన్నది ఉత్తర కొరియా ఆలోచనగా కనిపిస్తోంది. అయితే ఈ విషయంలోమరింత ముందుకెళ్లి తమ సార్వభౌమత్య పరిరక్షణకు ఎంతకైనా తెగిస్తామన్న రీతిలో ఉత్తర కొరియా నాయకత్వం బలప్రదర్శనకే దిగుతోంది. ఇప్పటికే ఈ రకమైన సందర్భాల్లో సైనిక ప్రదర్శనలకు, క్షిపణి పరీక్షలకు ఉత్తర కొరియా ఒడిగట్టిన నేపథ్యం లో శనివారం ఏమి ముంచుకురాబోతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.