అంతర్జాతీయం

ఖాళీ అయిపోయిన ఫ్లోరిడా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మయామి, సెప్టెంబర్ 9: మొన్న కరేబియన్ దీవులు, తాజాగా క్యూబాలో విధ్వంసం సృష్టించిన భయంకర పెనుతుపాను ‘ఇర్మా’ అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం వైపుగా దూసుకు వస్తుండంతో లక్షలాది మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు 56 లక్షల మందిని ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశించారు. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం సమయానికి ‘ఇర్మా’ హరికేన్ మయామికి దాదాపు 245 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది స్థానిక కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి లేదా ఆదివారం ఉదయానికల్లా ఫ్లోరిడా వద్ద తీరాన్ని దాటవచ్చని, తీరాన్ని దాటే సమయంలో గంటకు 155 మైళ్ల వేగంతో పెనుగాలులు వీచవచ్చని అమెరికా జాతీయ తుపానుల హెచ్చరికల కేంద్రం తెలిపింది. ‘ఇర్మా’ హరికేన్ తీవ్రత ముందు ఊహించిన దానితో పోలిస్తే కాస్త తగ్గినప్పటికీ ఇప్పటికీ భారీనష్టాన్ని కలుగజేసే స్థితిలోనే ఉందని వాతావరణ అధికారులు అంటున్నారు. అందువల్ల వీలయినంత త్వరగా తుపాను ప్రభావిత ప్రాంతాలనుంచి ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫ్లోరిడా రాష్ట్ర జనాభాలో దాదాపు నాలుగో వంతు అంటే 56 లక్షల మందిని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా ఆదేశించినట్లు అధికారులు చెప్తున్నారు. 1992లో 65 మంది ప్రాణాలను బలిగొన్న హరికేన్ ‘ఆండ్రూ’కన్నా ‘ఇర్మా’ హరికేన్ ఎన్నో రెట్లు ప్రమాదకరమైందని, రాష్ట్రంలోని మొత్తం 2.06 కోట్ల జనాభా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్ అన్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఫ్లోరిడా నగరంలోని జనం అంతా ఖాళీచేసి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడంతో నగరమంతా నిర్మానుష్యంగా కనిపిస్తోంది. రోడ్లపై వందలాది కార్లు ఒకదాని వెనుక మరోటి క్రిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. కాగా, ప్రభుత్వం ఏర్పాటుచేసిన శిబిరాల్లో తలదాచుకుంటున్న కొందరయితే తాము కట్టుబట్టలతో చేతిలో చిల్లిగవ్వ లేకుండా కాళీచేసి రావలసి వచ్చిందని వాపోతున్నారు.
రెండు రోజుల క్రితం ఇర్మా పెనుతుపాను సృష్టించిన బీభత్సానికి కరేబియన్ దీవుల్లో భారీస్థాయిలో ఆస్తి నష్టం సంభవించింది. సెయింట్ మార్టిన్, సెయింట్ బార్ట్స్ దీవుల పరిధిలో ఇళ్లు, వాహనాలు, వ్యాపారాలకు దాదాపు 20 కోట్ల యూరోల మేర నష్టం వాటిల్లిందని ఫ్రెంచ్ ప్రభుత్వ టీవీ తెలిపింది. ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనాయని, విమానాశ్రయం కూడా మూతపడిందని సెయింట్ బార్ట్స్ నివాసి ఆలివర్ టౌస్సెంట్ చెప్పాడు. వందలాది కార్లు తలకిందులైనాయని, వేలాది బోట్లు సముద్రంలో మునిగిపోయాయని, షాపులు దెబ్బతిన్నాయని అతను చెప్పాడు. కాగా, అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన మరో రెండు హరికేన్లు అమెరికన్లను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. కటియా తుపాను శుక్రవారం భారీ భూకంపం సంభవించిన మెక్సికో తీరాన్ని తాకి కుండపోత వర్షాలను కురిపిస్తుండడంతో ఎక్కడ ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడ్డం లాంటి విపత్తులు సంభవిస్తాయోనని స్థానికులు వణికి పోతున్నారు. మరో హరికేన్ ‘జోస్’ ఇర్మా పయనించిన మార్గంలోనే కదులుతూ ఉండడం అధికారులను మరింత భయభ్రాంతులకు గురిచేస్తోంది.

చిత్రం..‘ఇర్మా’ తుపాను ముంచుకొస్తోందన్న వార్తలతో ఫ్లోరిడాను వీడిపోతున్న దృశ్యం