అంతర్జాతీయం

మెక్సికోను కుదిపేసిన భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెక్సికో, సెప్టెంబర్ 9: అతిశక్తివంతమైన భూకంపం మెక్సికోను కుదిపేసింది. గురువారం రాత్రి 11.49 గంటలకు 8.2 తీవ్రతతో మెక్సికో దక్షిణ ప్రాంతంలోని ఛియాపాస్‌కు 119 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం తీవ్రతకు ఇప్పటివరకు 61 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఒక్క ఆక్సకా నగరంలోనే 45 మంది మరణించారని, ఛియాపాస్‌లో 10 మంది, తబాస్కోలో ముగ్గురు మరణించినట్లు జాతీయ అత్యవసర కమిటీ వెల్లడించింది. ఈ భూకంపం తీవ్రతకు ఛియాపాస్‌లో 1700 నివాస గృహాలు, 700 పాఠశాలలతోపాటు 18 ఇతర ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సునామీ రావచ్చన్న సంకేతాలు వెల్లడి కావడంతో పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతంలోని దాదాపు 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూకంపం తీవ్రతకు దెబ్బతిన్న ఆక్సకా నగరాన్ని అధ్యక్షుడు ఎన్‌రిఖ్ పెనానీటో సందర్శించారు.

చిత్రాలు.. మెక్సికోలో సంభవించిన భూకంపం తాకిడి నేలమట్టమైన ఇళ్లు, ఒక పక్కకు ఒరిగిపోయన భవనం