అంతర్జాతీయం

భారీగా పెరిగిన రోహింగ్యాల వలస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాక్స్ బజార్ (బంగ్లాదేశ్), సెప్టెంబర్ 9: హింసాకాండతో అట్టుడుకుతున్న మయన్మార్‌లోని రఖినే రాష్ట్రం నుంచి గత 15 రోజుల్లో దాదాపు 3 లక్షల మంది రోహింగ్యా ముస్లింలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బంగ్లాదేశ్‌కు పారిపోయారు. ఐక్యరాజ్య సమితి శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఈ విధంగా వలసవస్తున్న వారి సంఖ్య రోజుకు 20 వేలకు పెరిగిందని, గత నెల 25వ తేదీ నుంచి దాదాపు 2.90 లక్షల మంది బంగ్లాదేశ్‌కు చేరుకున్నారని ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ అధికార ప్రతినిధి జోసఫ్ త్రిపుర స్పష్టం చేశారు. ఇంతకుముందు సహాయ సంస్థల సేవలు అందని ప్రాంతాల జాబితాలో రోహింగ్యాలు నివసిస్తున్న పలు గ్రామాలు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి గుర్తించిందని అధికారులు తెలిపారు. రోహింగ్యా ముస్లింలలో ఎక్కువ మంది కాలి నడక ద్వారానో లేక నాఫ్ నది మీదుగా పడవల ద్వారానో బంగ్లాదేశ్‌కు చేరుకుంటున్నారు. రోహింగ్యా ముస్లింల వలసలు బుధవారం భారీగా పెరిగాయని, మయన్మార్ నుంచి ఒకే రోజు 300 పైగా పడవలు బంగ్లాదేశ్‌కు చేరుకున్నాయని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. బౌద్ధ మతస్తులు అధిక సంఖ్యలో ఉన్న మయన్మార్‌లో రోహింగ్యాలకు అక్కడి ప్రభుత్వం పౌరసత్వాన్ని నిరాకరిస్తోంది. దీంతో వారు చాలా కాలం నుంచి తీవ్రమైన వివక్షకు గురవుతున్నారు. ఎన్నో తరాల నుంచి వీరు మయన్మార్‌లో నివసిస్తున్నప్పటికీ వీరందరినీ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసవచ్చిన శరణార్థులుగా ప్రభుత్వం పరిగణిస్తోంది.
ఇలావుండగా మయన్మార్‌లో రోహింగాలు ఎన్నో ఏళ్ల నుంచి హత్యలు, అత్యాచారాలు, హింసాకాండకు గురవుతున్నారని మలేషియా ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ ఆవేదన వ్యక్తం చేశారు.