రాష్ట్రీయం

మార్చి 2నుంచి ఇంటర్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి నిర్వహణ
ఎస్సెస్సీ పరీక్షలకూ తేదీలు ఖరారు
మార్చి 21నుంచి తెలంగాణలో.. 24నుంచి ఆంధ్రలో

హైదరాబాద్, నవంబర్ 23: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూళ్లు ఖరారయ్యాయి. 2016 మార్చి 2నుంచి ఇరు రాష్ట్రాల్లో ఒకేమారు ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈమేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల టైమ్ టేబుల్‌ను సోమవారం విడుదల చేసింది. ఆంధ్ర ఇంటర్ బోర్డు అధికారికంగా పరీక్షల టైమ్ టేబుల్‌ను విడుదల చేయాల్సి ఉంది. అదేవిధంగా టెన్త్ పరీక్షల షెడ్యూలు సైతం ఖరారైనా అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది. ఆంధ్ర ఎస్సెస్సీ పరీక్షలు 2016 మార్చి 24 నుంచి ప్రారంభమవుతాయి. తెలంగాణ ఎస్సెస్సీ పరీక్షలు 2016 మార్చి 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ షెడ్యూళ్లు ఒకటి రెండు రోజుల్లో రానున్నాయి. ఇంటర్ పరీక్షలు మార్చి 2నుంచి 21 వరకూ జరుగుతాయి. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ జరుగుతాయి. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రోజు విడిచి రోజు జరుగుతాయి. ఈ పరీక్షలకు ముందు నైతిక - మానవ విలువల అంశంపై జనవరి 26న ప్రత్యేక పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఫిబ్రవరి 3 నుంచి 24 వరకూ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది తెలంగాణలో రాష్టవ్య్రాప్తంగా సుమారు 8 లక్షల మంది, ఆంధ్రలో 7లక్షల మంది ఇంటర్ పరీక్షలు రాయనున్నారు.
ఫస్టియర్ పరీక్షలు:
మార్చి 2న పార్టు -2 సెకండ్ లాంగ్వేజి పేపర్-1, మార్చి 4న పార్టు-1 ఇంగ్లీషు పేపర్-1 జరుగుతాయి. మార్చి 8న మాథ్స్ పేపర్ 1ఎ, బోటనీ -1, సివిక్స్-1, సైకాలజీ-1, మార్చి 10న మాథ్స్ 1బి, జువాలజీ 1, హిస్టరీ-1 జరుగుతాయి. మార్చి 12న ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్-1, క్లాసికల్ లాంగ్వేజి -1 జరుగుతాయి. మార్చి 15న కెమిస్ట్రీ -1, కామర్స్-1, సోషియాలజీ -1, ఫైన్ ఆర్ట్సు-1 , మార్చి 17న జియాలజీ-1, హోం సైన్స్-1, పబ్లిక్ యాడ్-1, లాజిక్-1, బ్రిడ్జికోర్సు మాథ్స్ పేపర్-1, మార్చి 19న మోడరల్ లాంగ్వేజి -1, జాగ్రఫీ- 1.
సెకండియర్ పరీక్షలు:
మార్చి 3న సెకండ్ లాంగ్వేజి పేపర్-2, మార్చి 5న ఇంగ్లీషు-2, మార్చి 9న మాథ్స్ పేపర్-2ఎ, బోటనీ -2, సివిక్స్-2, సైకాలజీ-2, మార్చి 11 మాథ్స్-2బి, జువాలజీ-2, హిస్టరీ-2, మార్చి 14న పిజిక్స్-2, ఎకనామిక్స్-2, క్లాసికల్ లాంగ్వేజి -2, మార్చి 16న కెమిస్ట్రీ-2, కామర్స్-2, సోషియాలజీ-2, ఫైన్ ఆర్ట్సు -2, మార్చి 18న జియాలజీ-2, హోంసైన్స్-2, పబ్లిక్ యాడ్-2, లాజిక్-2, బ్రిడ్జి కోర్సు మాథ్స్-2, మార్చి 21న మోడరల్ లాంగ్వేజి పేపర్-2 జరుగుతాయి.