బిజినెస్

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ పరిశ్రమ రాబోతోంది. భారీ పంపు సెట్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లియో గ్రూపు.. భారత్‌లో తమ వ్యాపార విస్తరణకు హైదరాబాద్‌ను ఎంచుకుంది. తెలం గాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చైనా పర్యటన సందర్భంగా టిఎస్ ఐపాస్ గురించి లియో కంపెనీకి వివరించారు. దీంతో తెలంగాణలో పరిశ్రమ స్థాపనకు లియో ఆసక్తి చూపించింది. ఈ క్రమంలోనే లియో కంపెనీ ప్రతినిధులు గురువారం టి హబ్‌లో ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌తో సమావేశమయ్యారు. జర్మనీకి చెందిన వాయిత్ గ్రూపుతో కలిసి హైదరాబాద్‌లో పంపు సెట్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. భారత్‌లో వౌలిక వసతుల రంగంలో వస్తున్న భారీ ప్రాజెక్టులతో డిమాండ్ ఎక్కువగా ఉందని, అందుకే తెలంగాణలో తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. కాగా, పంపు సెట్ల తయారీతో పాటు ఐటి రంగం, పరిశోధన సంస్థ ఏర్పాటు చేసేందుకు లియో సంస్థ ఆసక్తి చూపింది. 2016 నాటికి పనులు ప్రారంభించనున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ పరిశ్రమ వల్ల రెండువేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. పరిశ్రమ స్థాపనకు స్థలాలను లియో గ్రూప్‌నకు చూపించాలని అధికారులను కెటిఆర్ ఆదేశించారు.