నల్గొండ

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, మార్చి 7: ‘యత్ర నార్యంతు పూజ్యంతు, రమంతే తత్ర దేవతా’... ఎక్కడ స్ర్తిలు పూజింపబడుతారో అక్కడ దేవతలు ఆనందంతో సంచరిస్తారని పూరాణాల్లో పేర్కోనడం జరిగింది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల్లో మాతృమూర్తిని పూజించే విశిష్టమైన లక్షణం కనిపిస్తుంది. నేటి సమాజంలో స్ర్తిలు అన్ని రంగాల్లో ముందుజ వేస్తున్నారు. అయితే మార్పు అనుకున్నంతగా సాగకపోవడంతో మహిళాలోకానికి చీకటి తెరలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఆకాశంలో సగ భాగంగా ఉన్న మహిళలు స్థితిగతుల్లో ఆశించిన మార్పు లేకపోవడానికి కారణం అసమానత, అణచివేత, దోపిడీ వీటిని రూపుమాపినప్పుడే మహిళలు అన్ని రంగాల్లో మరింత ముందడుగు వేసేందుకు వీలుంటుంది. మహిళ దినోత్సవం మొదటి సారిగా 1909 ఫిబ్రవరి 28న అమెరికాలో సోషలిస్టు పార్టీ ఆఫ్ అమెరికా తీర్మానం మేరకు నిర్వహించగా, 1910 ఆగస్టులో కోపెన్‌హెగన్‌లో అంతర్జాతీయ మహిళ సదస్సును నిర్వహించారు. 1911 మార్చి 18న ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్వీట్జర్లాండ్‌లలో తొలిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. 1913 రష్యాలో ఫిబ్రవరి చివరి ఆదివారం నాడు, 1917లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నిర్వహించిన భారీ మహిళ ర్యాలీ మహిళ విప్లవాన్ని రగిలించింది. 1965లో సోవియట్‌లో అంతర్జాతీయ మహిళ దినం రోజున సెలువు ఇవ్వడం ప్రారంభించగా, చైనాలో 1922, స్పెయిన్‌లో 1936లో అంతర్జాతీయ దినోత్సవాన్ని పాటించారు. పాశ్చాత్య దేశాల్లో 1977 నుండి అంతర్జాతీయ వేడుకలా మహిళ దినాన్ని నిర్వహించడంతో ఐక్యరాజ్యసమితి మార్చి 8ని ప్రత్యేక దినంగా గుర్తించారు.