బిజినెస్

రూ. 90 వేల కోట్ల పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- రాయలసీమ, ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి ప్రణాళిక -
పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తల నుంచి 177 దరఖాస్తులు
రాష్టవ్య్రాప్తంగా 1.88 లక్షల మందికి ఉపాధి
ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 17: రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం రద్దు కావడంతో, ఆయన సభకు లిఖితపూర్వకంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో రూ. 90,377 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడతామని 177 మంది పారిశ్రామికవేత్తలు దరఖాస్తులు చేశారని, దీని వల్ల 1.88 లక్షల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ వల్ల ఒక లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయని, 50 వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో జాతీయ పెట్టుబడి తయారీ జోన్‌ను మంజూరు చేసిందన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో మరో జోన్ వస్తుందన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 12,005 కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు వస్తాయని, దీని వల్ల 22వేల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. కర్నూలు జిల్లా మెసర్స్ ఆల్ట్రా టెక్ సిమెంట్ సంస్థ 4 వేల కోట్ల రూపాయలతో సిమెంట్ ఫ్యాక్టరీని నెలకొల్పుతున్నట్లు తెలిపారు. మెసర్స్ జైరాజ్ ఇస్పాట్ లిమిటెడ్ సంస్థ ఇదే జిల్లాలో మూడు వేల కోట్ల రూపాయలతో టిఎంటి బార్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తుందన్నారు. అనంతపురం జిల్లాలో బిఇఎల్ 500 కోట్ల రూపాయలతో, మెసర్స్ విఠల్ ఇన్నోవేషన్ సిటీ సంస్థ డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ సంస్థను రెండు వందల కోట్ల రూపాయలతో నెలకొల్పుతుందన్నారు.
2 లక్షల గృహాలు
ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద రెండు లక్షల గృహాలను మంజూరు చేసి అమలు చేసేందుకు మార్గదర్శకాలను జిల్లాలకు పంపించినట్లు ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి మృణాళిని శాసనసభకు తెలిపారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద 2004-05 నుంచి 2014-15 వరకు మొత్తం 41,42,741 గృహాలను మంజూరు చేశామన్నారు.