రాష్ట్రీయం

పెట్టుబడులకు లండన్ ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయోత్సాహంతో స్వరాష్ట్రానికి బాబు బృందం * మూడు రోజుల పర్యటనలో ఎనలేని ఆదరణ

హైదరాబాద్, మార్చి 13: పెట్టుబడిదారుల కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ త్వరలోనే గాడిలో పడుతుందా..గత మూడు రోజులుగా లండన్‌లో పర్యటిస్తున్న ప్రతినిధి బృందానికి లభించిన ఆదరణ చూస్తే అది నిజమే అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు నాయకత్వంలోని రాష్ట్ర బృందం లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఢిల్లీ మీదుగా ఆదివారం రాష్ట్రానికి చేరుకుంది. ఆదివారం రాష్ట్రానికి చేరుకుంది. ఢిల్లీలో ముఖ్యమంత్రి రెండు మూడు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నా, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చిట్టిబాబు ఆకస్మిక మరణంతో ఆయన నేరుగా రాజమండ్రి వెళ్లారు.
లండన్ పర్యటనలో రెండు రోజులు బిజిబిజీగా గడిపిన చంద్రబాబుతో పలు కంపెనీల ప్రతినిధులు పెట్టుబడులపై చర్చించారు. ఎపిలో పెట్టుబడులు పెట్టడంతో పాటు కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవాలని సిఎం పిలుపునిచ్చారు. దానికి సైతం పారిశ్రామిక వేత్తలు సానుకూలంగా స్పందించడంతో ప్రతినిధి బృందం పర్యటన విజయవంతం అయిందని భావిస్తున్నారు. ఢిల్లీలో పనులను ముగించుకున్న సిఎం నేరుగా అక్కడి నుండి రాజమండ్రి చేరుకున్నారు. లండన్‌లో పారిశ్రామిక వేత్తలు , పెట్టుబడిదారులు ప్రత్యేక ఆసక్తి కనబరచడంతో పాటు ప్రాక్టికల్‌గా తమకు ఎదురయ్యే సమస్యలను చెప్పడంతో వాటిని అక్కడికక్కడే పరిష్కరించి ఆంధ్రప్రదేశ్‌కు ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సిఎం ప్రకటించారు. వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ గురించి వివరించి, వారిని రాష్ట్రానికి ఆహ్వానించడం ద్వారా లండన్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయిందని ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలోని ప్రతినిధి బృందం లండన్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయిందని చెబుతున్నారు. తొలి రోజు తూర్పు లండన్‌లోని కనరీ వార్ఫ్ ప్రాంతంలో పారిశ్రామిక వేత్తలతో సమావేశం అయ్యారు. లండన్ చేరుకున్న వెంటనే ఆంధ్రా బృందం థేమ్స్ దక్షిణ ఒడ్డున ఉన్న ఆకర్షణీయ పర్యాటక స్థలం లండన్-ఐను సందర్శించింది. అమరావతిలోనూ లండన్ ఐ తరహా పర్యాటక ఆకర్షక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అనంతరం సిఎంతో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజి ప్రతినిధులు ప్రతినిధులతో సిఎం సమావేశమయ్యారు. లండన్‌లో పనిచేస్తున్న లండన్ స్టాక్ ఎక్స్ఛేంజి పనితీరును సిఇఓ నిఖిల్ రాఠీ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వౌలిక సదుపాయాల కల్పనపై లండన్ ప్రతినిధులతో చంద్రబాబు బృందం చర్చించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వౌలిక సదుపాయాల కల్పనకు ముందుకు రావాలని సిఎం వారిని కోరారు. ముఖ్యంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ చేసే అంశంపై ప్రతిపాదలతో రావాలని కోరగా అమరావతి నిధుల సమీకరణలో సహాయం అందించడానికి లండన్ స్టాక్ ఎక్స్చేంజి ప్రతినిధులు అంగీకరించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌గా లండన్‌లో అభివృద్ధి చెందిన ద్వీపకల్పం కేనరీ వార్ఫ్ లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. యుకెలో అగ్రగామి 20 సంస్థల ప్రతినిధులు వార్ఫ్ సభకు హాజరయ్యారు. గ్రేటర్ లండన్ అథారిటీ, ఆర్‌ఐసిఎస్, ఐకామ్, బెనాయ్, అరూప్, మోట్‌మ్యాక్ డోనాల్డ్, కెటాపల్ట్, స్టడీవ్ ఎరీనా, వోడాఫోన్, రోల్స్ రోయిస్, హెర్బెర్ట్, స్మిత్‌ఫ్రీ హిల్స్, జెసిబి, ఎఆర్‌ఎం, మెస్, గ్లీడ్ తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సిఎం వారిని కోరారు.
చంద్రబాబు వెంట మంత్రులు డాక్టర్ పి నారాయణ, యనమల రామకృష్ణుడు, ఎన్‌ఆర్‌ఐ సలహాదారుడు డాక్టర్ రవికుమార్ పి వేమురు, సిఎం ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్ర, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి పెనుమాక వెంకట రమేష్ బాబు, క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజిమెంట్ కార్పొరేషన్ చైర్మన్ డి లక్ష్మీ పార్ధసారధి, టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, సిఆర్‌డిఎ కమిషనర్ నాగులపల్లి శ్రీకాంత్, సిఎం పిఎస్ పెండ్యాల శ్రీనివాసరావు, చీఫ్ సెక్యూరిటీ అధికారి కూచిపూడి నాగేష్‌బాబు ఉన్నారు.