బిజినెస్

రూ. 8 వేల కోట్లు వెనక్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెట్టుబడుల ఉపసంహరణలో విదేశీ మదుపరులు
న్యూఢిల్లీ, నవంబర్ 22: ఈ నెలలో దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు 8 వేల కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకు న్నారు. అంతకుముందు రెండు నెలల్లో పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదేశీ మదుపరులు.. గత నెల అక్టోబర్‌లో మాత్రం పెట్టుబడులను వెల్లువలా తెచ్చినది తెలిసిందే. అయతే నవంబర్ మొదలు ఇప్పటిదాకా (2-19 తేదీల్లో) 8,278 కోట్ల రూపాయల (1.26 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను విదేశీ పోర్ట్ఫొలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) అటు స్టాక్ మార్కెట్లు, ఇటు రుణ మార్కెట్ల నుంచి గుంజేసుకున్నారు. స్టాక్ మార్కెట్ల నుంచి 5,713 కోట్ల రూపాయలు, రుణ మార్కెట్ల నుంచి 2,565 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోయాయ. కాగా, అమెరికా ఫెడ్‌రిజర్వ్ డిసెంబర్‌లో వడ్డీరేట్లు పెంచుతుందన్న సంకేతాలు, పలు ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతానికి పెరగడం, పారిశ్రామి కోత్పత్తి సూచీ (ఐఐపి) నాలుగు నెలల కనిష్టానికి పతనమవడం వంటివి విదేశీ మదుపరులను పెట్టుబడుల ఉపసంహరణకు ఉసిగొలిపాయ. ఇకపోతే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 23,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు ఉపసంహ రించుకున్నప్పటికీ, అక్టోబర్‌లో తిరిగి 22,350 కోట్ల రూపాయల (3.44 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను పట్టుకొచ్చారు. ఫలితంగా అక్టోబర్ నెలలో ఏడు నెలల గరిష్ఠానికి ఎఫ్‌పిఐ పెట్టుబడులు చేరినట్లైంది. మార్చి (రూ. 20,723 కోట్లు) తర్వాత మళ్లీ అక్టోబర్‌లోనే భారీగా విదేశీ పెట్టుబడులు తరలివచ్చాయ. కాగా, ప్రపంచ ఆర్థిక మందగమనం మధ్య సెప్టెంబర్‌లో 5,784 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు వెనక్కి తీసుకోగా, అంతకుముందు నెల ఆగస్టులోనైతే ఏకంగా 17,524 కోట్ల రూపాయలను గుంజేసుకున్నారు. మరోవైపు ఈ ఏడాది ఆరంభం నుంచి గమనిస్తే ఏప్రిల్ వరకు దేశీయ మార్కెట్లలో నెలసరి విదేశీ పెట్టుబడులు క్రమేణా తగ్గుతూ వచ్చాయ. జనవరిలో 33,688 కోట్ల రూపాయలుగా ఉన్న ఎఫ్‌పిఐ పెట్టుబడులు.. ఫిబ్రవరిలో 24,564 కోట్ల రూపాయలుగా, మార్చిలో 20,723 కోట్ల రూపాయలుగా, ఏప్రిల్‌లో 15,333 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. మే, జూన్ నెలల్లో పెట్టుబడులు రాకపోగా, వెనక్కి వెళ్లిపోయాయి. మే నెలలో 14,272 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలిపోయాయ. జూన్‌లో 1,608 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు లాగేసుకున్నారు. జూలైలో మళ్లీ పెట్టుబడుల రాక మొదలైనా.. ఆగస్టులో తిరిగి పెట్టుబడుల పోకడే మిగిలింది. జూలైలో 5,323 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. దీంతో పరిస్థితులు మళ్లీ గాడిలో పడ్డాయనుకుంటే ఆగస్టులో అందుకు విరుద్ధం గానే ఫలితాలు నమోదయ్యాయ. సెప్టెంబర్‌లోనూ తీరు మారలేదు. అయతే ఆర్‌బిఐ అనూహ్యంగా సెప్టెంబర్ 29న నిర్వహించిన నాలుగో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లైన రెపో, రివర్స్ రెపోలను 50 బేసిస్ పాయంట్ల చొప్పున తగ్గించడంతో నష్టాల నుంచి తేరుకున్న స్టాక్ మార్కెట్లు అక్టోబర్‌లో లాభాల్లో కదలాడాయ. ఈ పరిణామం వరుస రెండు నెలల విదేశీ పెట్టుబడుల ఉపసంహరణకు కళ్లెం వేసింది. అయతే నవంబర్‌లో మళ్లీ పెట్టుబడుల ఉపసంహరణే జరుగుతోంది. 15 రంగాల్లో ఎఫ్‌డిఐ నిబంధనలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సరళతరం చేయడంతో విదేశీ మదుపరులు మధ్యలో తిరిగి పెట్టుబడులకు ఆసక్తి కనబరిచినప్పటికీ ఫలితం లేకపోయంది. ఇకపోతే ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా దేశీయ స్టాక్ మార్కెట్లలోకి 21,984 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్లలోకి 52,531 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు.