బిజినెస్

ఐఓసి, రిలయన్స్‌లే మేటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫార్చ్యూన్ ఇండియా-500 జాబితాలో ఆరోసారి టాప్ ర్యాంకులు
తర్వాతి స్థానాల్లో టాటా మోటర్స్, ఎస్‌బిఐ * దిగజారిన బిపిసిఎల్

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి)తో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ఈ ఏడాది ఫార్చ్యూన్-500 భారత కంపెనీల జాబితాలో వరుసగా ఆరోసారి అగ్రస్థానాలను కైవసం చేసుకున్నాయి. మొత్తం 4,51,911 కోట్ల రూపాయల వార్షిక ఆదాయంతో ఐఓసి ఈ జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకోగా, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌ఐఎల్ 3,82,565 కోట్ల వార్షికాదాయంతో ద్వితీయ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన టాటా మోటార్స్ సంస్థ ఈ ఏడాది రూ.2,67,025 కోట్ల వార్షికాదాయంతో భారత్ పెట్రోలియం (బిపిసిఎల్)ను పక్కకు నెట్టి మూడో స్థానానికి ఎగబాకగా, 2014లో ఆరో ర్యాంకులో నిలిచిన ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద ఆర్థిక సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఈ సంవత్సరం రూ.2,57,289 కోట్ల ఆదాయంతో నాలుగో స్థానానికి చేరుకుంది. గత ఏడాది ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచిన బిపిసిఎల్ ప్రస్తుతం 2,40,367 కోట్ల వార్షిక ఆదాయంతో ఈసారి ఐదో స్థానానికి దిగజారింది. దేశంలోని అగ్రగామి సంస్థలు, వాటి వార్షిక ఆదాయ వివరాల జాబితాలను అంతర్జాతీయ వాణిజ్య పత్రిక ‘్ఫర్చ్యూన్’ భారత ఎడిషన్ 2010 నుంచి ప్రకటిస్తున్న విషయం విదితమే. ఈ ఏడాది ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారత కంపెనీల మొత్తం ఆదాయం గత ఏడాది కంటే స్వల్పంగా 2.7 పెరిగిందని, లాభాలు 5.9 శాతం తగ్గాయని ఆ పత్రిక వెల్లడించింది. 2010లో ఫార్చ్యూన్ ఇండియా-500 జాబితాలోని సంస్థల మొత్తం ఆదాయం 38,16,000 కోట్ల రూపాయలుగా ఉండగా, ప్రస్తుతం అది దాదాపు రెట్టింపై 71,27,000 కోట్లకు పెరిగిందని, అయితే వీటిని లాభాలుగా చెప్పలేమని, ఈ మధ్య కాలంలో ఆయా సంస్థల లాభాలు కేవలం 3.6 శాతం మాత్రమే పెరిగాయని ఆ పత్రిక పేర్కొంది. ప్రస్తుతం ఈ జాబితాలోని తొలి పది ర్యాంకుల్లో నిలిచిన ఇతర సంస్థల్లో హిందుస్థాన్ పెట్రోలియం రూ.2,13,380 కోట్ల వార్షిక ఆదాయంతో ఆరో స్థానాన్ని, ఓఎన్‌జిసి (రూ.1,65,161 కోట్లు) ఏడో స్థానాన్ని, టాటా స్టీల్ (రూ.1,41,669 కోట్లు) ఎనిమిదో స్థానాన్ని, హిందాల్కో ఇండస్ట్రీస్ (రూ.1,06,897 కోట్లు) తొమ్మిదో స్థానాన్ని, టిసిఎస్ (రూ.98,368 కోట్లు) పదో స్థానాన్ని దక్కించుకోగా, ఐడియా సెల్యులార్ 47వ ర్యాంకులోనూ, ఏషియన్ పెయింట్స్ 85వ ర్యాంకులోనూ, టివిఎస్ మోటార్ కంపెనీ 125వ ర్యాంకులోనూ, గోద్రెజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ 157వ ర్యాంకులోనూ, క్వాలిటీ 195వ ర్యాంకులోనూ, ఏజిస్ లాజిస్టిక్స్ 271వ ర్యాంకులోనూ, శ్రేయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ 303వ ర్యాంకులోనూ, ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 397వ ర్యాంకులోనూ, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 447వ ర్యాంకులోనూ నిలిచాయి.