జాతీయ వార్తలు

ఇమ్రాన్‌కు ఫోన్‌లో ట్రంప్ హితబోధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌కు ఫోన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హితబోధ చేశారు. ఈ మేరకు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది. జమ్మూకశ్మీర్ అంశంపై ఉద్రిక్తతలు తగ్గించాల్సిన అవసరాన్ని చెబుతూ, ఆ అంశంపై భారత్‌తో మితంగా మాట్లాడాలని ఇమ్రాన్‌కు ట్రంప్ సూచించినట్టు శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉభయ దేశాలు సంయమనం పాటించాలని కూడా ఇమ్రాన్‌కు ట్రంప్ సూచించారు. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత్ రద్దు చేసినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్‌లో తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తూనే ఉన్నారు. మోదీని ఫాసిస్టుగా, రేసిస్టుగా కూడా ఆయన విమర్శించారు. అలాగే భారతదేశాన్ని హిందూజాత్యాంహకార దేశంగా మార్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని, భారత్‌లోని ముస్లింలకు హక్కులు లేకుండా పోతున్నాయని, ఆర్‌ఎస్‌ఎస్ గూండాలు పేట్రేగిపోతున్నారని కూడా ఇమ్రాన్ ఖాన్ విమర్శలు గుప్పిస్తున్నాడు. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేయడం, భద్రతా మండలిలో చైనా, పాకిస్తాన్‌లకు చుక్కెదురైన నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దాదాపు అరగంట పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో టెలిఫోన్ చర్చలు జరిపారు.ఈ నేపథ్యంలో పరోక్షంగా పాకిస్తాన్ ధోరణిని ఎండగడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హితబోధ చేశారు.